బాలిక కిడ్నాప్: యువకుడి రిమాండ్ | Youth remanded for kidnapping minor girl | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్: యువకుడి రిమాండ్

Published Thu, Jun 9 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Youth remanded for kidnapping minor girl

చాంద్రాయణగుట్ట : మైనర్ బాలికను అపహరించిన ఘటనలో ఓ యువకుడిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన పర్వీన్ బాను కుమార్తె సనా బాను(16) ఇంటి వద్దే ఉంటుంది. కాగా వీరి ఇంటికి  సమీపంలోనే ఉండే సుమేర్ అలీ బేగ్ (20) అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 2వ తేదీన  ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కర్నాటక గుల్బర్గకు తీసుకెళ్లాడు. ఈ విషయమై పర్వీన్ బాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను తల్లికి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement