మైనర్‌బాలికపై అత్యాచారయత్నం
Published Sun, May 28 2017 11:52 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
తంగెడంచ(జూపాడుబంగ్లా): మండలంలోని తంగెడంచ గ్రామానికి చెందిన మైనర్‌బాలికపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మోడల్ పాఠశాలలో చదువుతున్న బాలిక సెలవులకు ఇంటికి వచ్చింది.ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ అమ్మాయి కేకలు వేయడంతో తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హె డ్‌కానిస్టేబుల్ చెన్నయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement