సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): సామర్లకోట మండలకేంద్రంలోని స్టేషన్ సెంటర్‌లో జానకీ మిశ్రా(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జానకి భర్త 6 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న జానకి, మానసిక ఒత్తిడికిలోనై సోమవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు 6 ఏళ్ల పాప ఉంది.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.