ఇస్లామాబాద్:
పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాకు పాల్పడిన తొమ్మిది మందికి ఊరి శిక్ష ఖరారైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో రావల్పిండిలోని పరేడ్ లేన్ మసీదుపై దాడి జరిపిన ఘటనలో నిందితుడుగా ఉన్న ముహమ్మద్ ఘరి కూడా ఉన్నాడు. అతను తెహ్రిక్-ఇ- తాలిబన్(టీటీపీ)లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. 2009 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటనలో మొత్తం 38 మంది మృతి చెందగా 57 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ముల్తాన్లోని ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో హస్తం ఉన్న హర్కత్-ఉల్-జీహాద్-ఇ-ఇస్లాంలో కీలక సభ్యుడు అబ్దుల్ ఖుయ్యుంకు కూడా ఉరి శిక్ష పడింది. 2009 డిసెంబర్లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న టీటీపీ సభ్యుడు ఇమ్రాన్, ఆల్ ఖైదా సభ్యుడు అక్సన్ మహబూబ్లకు ఉరి శిక్ష పడింది.
సిపాయి-ఇ-సహబాలో సభ్యులుగా ఉన్న అబ్దుల్ రప్ గుజ్జర్, హసిం, సులేమాన్, ఫరూఖీ, ఫరాన్లు లాహోర్లో సాధారణ ప్రజలను చంపిన కేసులో ఉరి శిక్ష పడింది.
తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరి
Published Fri, Jan 1 2016 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM
Advertisement
Advertisement