మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
Published Wed, Jan 25 2017 12:05 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇచ్చిన అప్పు వసూలు కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. నగరంలోని రామచంద్రానగర్‌లో బి.పద్మావతి, కృష్ణారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. కృష్ణారెడ్డి హౌసింగ్ కార్పొరేషన్‌లో అటెండర్‌గా ఆదోనిలో పనిచేస్తున్నాడు. వీరు రామచంద్రానగర్‌లో 12 ఏళ్ల పాటు ఈశ్వరమ్మ అనే మహిళకు చెందిన ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే ఎక్కువ కాలం ఒక్కరే ఇంట్లో ఉంటే న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయని ఆమె వారిని ఆరు నెలల క్రితం ఇళ్లు ఖాళీ చేయించింది. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వారు ఈశ్వరమ్మ దగ్గర రూ. 24 వేలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ఈశ్వరమ్మ సోమవారం పద్మావతి ఇంటికెళ్లి తీవ్ర ఒత్తిడి చేసింది. తన భర్త రెండు, మూడు రోజుల్లో ఆదోని నుంచి వచ్చిన వెంటనే అప్పు చెల్లిస్తామన్నా వేడుకున్నా గోల చేయడంతో పద్మావతి మనస్తా«పానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement