
లక్ష్మీప్రసన్న మృతదేహం
ప్రకాశం, అద్దంకి: అప్పటి వరకు ఊయలలో ఊగుతూ చిన్నారి కేరింతలు కొట్టింది. కిలకిలా నవ్వింది. అంతలోనే ఆ ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడుగా మారింది. ఊయలగా చేసిన చీర మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాజీవ్ కాలనీలో సోమవారం జిరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీలో రాజు కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి లక్ష్మీ ప్రసన్న (9) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో బాలిక తండ్రి రెండు నెలల క్రితం, తల్లి 9 నెలల క్రితం మృతి చెందారు. చిన్నారి అత్త వద్దే ఉంటోంది. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకు చీరను ఊయలగా వేసుకుని బాలిక ఊగుతోంది. ఊయల గిరగిరా గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. కొద్దిసేపటికి చీర పైనుంచి మెలికలు పడటం మొదలు పెట్టింది. చిన్నారి కిందకు జారిన సమయంలో చీర మెడకు చుట్టుకుని బిగుసుకోవడంతో ఊపిరి ఆడక మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు.
బాలిక మృతిపై పలు అనుమానాలు
చిన్నారి తల్లిదండ్రులు ఇదివరకే మరణించడంతో బాలిక పేరుతో ఉన్న ఆస్తి కోసం బంధువులెవరైనా హత్య చేసి ఊయల ఊగుతూ మృతి చెందిందనే కథ అల్లి ఉండొచ్చనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగా మృతి చెందింది పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉంది. బాలిక మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment