ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
నల్లగొండ క్రైం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్కతట్ల పద్మ(40), చంద్రయ్య దంపతులు పట్టణంలోని రాక్‌హిల్స్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఆడపడచు జాల లింగమ్మ,ఆమె భర్త సైదులుతో భూ వివాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం పద్మ భర్త చంద్రయ్యపై బావసైదులు చేయి చేసుకోవడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో మనోవేదనకు గురైన పద్మ భర్త కూలికి వెళ్లిపొగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం ఇవ్వడంతో ఘటన స్తలాన్ని టూటౌన్ పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.