డీ కోటకొండలో వివాహిత ఆత్మహత్య
Published Sat, Nov 26 2016 11:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఆస్పరి: మండల పరిధిలోని డీ కోటకొండకు చెందిన వివాహిత సుధ అలియాస్ అరుణ (23) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వెంకటరమణ వివరాల మేరకు.. ఆదోని మండలం కల్లుబావికి చెందిన సుధను ఏడాదిన్నర్ర క్రితం కోటకొండకు చెందిన వీరేష్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 నెలలు కూతరు అక్షిత ఉంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎనిమిది నెలల వయసుల్లో తల్లి ప్రేమకు దూరమైన చిన్నారని చూసి స్థానికులు కంట తడి పెట్టారు.
Advertisement
Advertisement