
217 మందిని ఉరి తీశారు
బీరుట్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దారుణాలకు అంతూ అదుపు లేకుండా పోయాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 217 మందిని వారు నిర్థాక్షిణ్యంగా ఉరితీసినట్లు సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అకారణంగా ప్రాణాలుకోల్పోయిన వారిలో అమాయకులైన ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు వివరించింది. మే 16 నుంచి ఈ దమనకాండ సిరియా పురాతన నగరం పాల్మిరాలో ఉగ్రవాదులు సాగించినట్లు పేర్కొంది. ఉరి ద్వారా ప్రాణాలుకోల్పోయినవారిలో సామాన్య పౌరులు, చిన్నారులు కలిసి 67 మంది, 150 మంది ప్రభుత్వ బలగాలు, 12 మంది మహిళలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.