యువకుడి ఆత్మహత్య | youngman suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Jul 3 2017 11:47 PM | Updated on Nov 6 2018 8:08 PM

స్థానిక ఎస్సార్బీసీ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కుమారుడు బాల తిరుపతయ్య (23) ఆత్మహత్య చేసుకున్నాడు.

పాణ్యం : స్థానిక ఎస్సార్బీసీ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కుమారుడు బాల తిరుపతయ్య (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ చిరంజీవి వివరాల మేరకు  మృతుడికి పదిహేను రోజులుగా మానసిక స్థితి సరిగా లేదు. పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. గాలి సోకిందేమోనన్న ఉద్దేశ్యంతో అంత్రాలు కూడా వేయించారు. అయినా నయం కాలేదు. రాత్రుళ్లు నిద్రపోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేవాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా  గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. తెల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement