కొండలోకి పడిపోయిన కారు.. 8మంది మృతి | Eight Person Died Bilaspur Road Accident | Sakshi
Sakshi News home page

కొండలోకి పడిపోయిన కారు.. 8మంది మృతి

Published Fri, Mar 2 2018 11:30 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Eight Person Died Bilaspur Road Accident

సాక్షి, సిమ్లా: హిమచల్‌ ప్రదేశ్‌ భిలాస్పూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారి 21పై ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ వేగాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడంతో కారు కొండలోకి పడిపోయింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, ఒకరికి గాయలయ్యాయి. తీవ్ర గాయాలైన ఒకరిని దగ‍్గరలోని ఆసుపత్రికి తరలించారు. ​ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement