రౌడీషీటర్ను హత్య చేసేందుకు వచ్చి... | Cameraman was attacked by Strangers in Jubilee Hills | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్ను హత్య చేసేందుకు వచ్చి...

Published Fri, Sep 26 2014 9:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM

Cameraman was attacked by Strangers in Jubilee Hills

బంజారాహిల్స్: రౌడీషీటర్ను హత్య చేసేందుకు వచ్చిన కొందరు దుండగలు అతనే అనుకొని పొరబడి ఓ సినీ అసిస్టెంట్ కెమెరామెన్పై తల్వార్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శ్రీకృష్ణానగర్లో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... శ్రీకృష్ణానగర్ బి - బ్లాక్లో సినీ అసిస్టెంట్ కెమెరామెన్ గోపి తన స్నేహితులతో మాట్లాడుతుండగా రహ్మత్నగర్ నివాసి చోర్ చేత, చోర్ అబ్బు, శ్రీను తమ అనుచరులు 30 మందితో వచ్చి ఒక్కసారిగా తల్వార్లతో దాడి చేశారు.

అనంతరం వారు అక్కడి నుంచి పరారైయారు. గోపి తీవ్రగాయాలు కావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. స్థానిక రౌడీషీటర్ అర్జున్యాదవ్ను హత్య చేసేందుకు వచ్చిన దుండగలు అతనే అనుకొని పొరపాటున గోపిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement