Arjun Yadav
-
కోచ్ అర్జున్ యాదవ్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: అనుభవం లేని ఆటగాళ్లు, అర్హత లేని కోచ్ అర్జున్ యాదవ్ కారణంగానే రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూస్తోందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణమే అర్జున్ యాదవ్‌ను తొలగించి అన్ని అర్హతలు ఉన్న కోచ్‌ను హైదరాబాద్‌కు నియమించాలని ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)ను కోరారు. ‘పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఇన్నింగ్స్ 125 పరుగులతో ఓడటం సిగ్గుచేటు. అనుభవం లేని క్రికెటర్లు జట్టులో ఉన్నారు. హెచ్‌సీఏ కక్ష సాధింపు ధోరణిని విడిచిపెట్టి అనువజు్ఞడైన అంబటి రాయుడును తిరిగి హైదరాబాద్ జట్టులో ఆడించాలి. కోచ్ అర్జున్ యాదవ్‌ను కూడా వెంటనే తప్పించి ఆయన స్థానంలో అర్హత ఉన్న మరో కోచ్‌ను నియమించాలి. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో మాట్లాడి హైదరాబాద్ రంజీ జట్టులోకి రాయుడును తీసుకొచ్చే అంశంపై కేటీఆర్ శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నా. ఇలా చేస్తేనే హైదరాబాద్ జట్టుకు మేలు జరుగుతుంది’ అని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. -
గ్రీన్ టీ.. రుచులు
టేస్ట్‌లో కాస్త తేడాగా ఉన్నా.. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గ్రీన్ టీ బెనిఫిట్‌ను మరింత పెంచే ప్రయత్నం చేసింది బేగంపేటలోని వివంతా తాజ్. గ్రీన్ టీతో ప్రత్యేకమైన రెసిపీస్ తయారు చేసింది. టెట్లే గ్రీన్ టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వివంతా తాజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ గ్రీన్ టీతో తయారు చేసిన స్పెషల్ రెసిపీస్ పరిచయం చేశారు. వెజిటబుల్ షమ్మీ, స్పైసీ గ్రీన్స్, మలాయ్ సాస్, స్నో పీస్ వంటి వంటకాలను గ్రీన్ టీ వాటర్ మిక్స్ చేసి తయారు చేశారు. గుడ్ హెల్త్ కోరుకునే వారు ఈ రెసిపీస్ టేస్ట్ చేయడం ద్వారా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. -
రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు వచ్చి...
బంజారాహిల్స్: రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు వచ్చిన కొందరు దుండగలు అతనే అనుకొని పొరబడి ఓ సినీ అసిస్టెంట్ కెమెరామెన్‌పై తల్వార్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శ్రీకృష్ణానగర్‌లో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... శ్రీకృష్ణానగర్ బి - బ్లాక్‌లో సినీ అసిస్టెంట్ కెమెరామెన్ గోపి తన స్నేహితులతో మాట్లాడుతుండగా రహ్మత్‌నగర్ నివాసి చోర్ చేత, చోర్ అబ్బు, శ్రీను తమ అనుచరులు 30 మందితో వచ్చి ఒక్కసారిగా తల్వార్లతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయారు. గోపి తీవ్రగాయాలు కావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. స్థానిక రౌడీషీటర్ అర్జున్యాదవ్ను హత్య చేసేందుకు వచ్చిన దుండగలు అతనే అనుకొని పొరపాటున గోపిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆంధ్రాబ్యాంక్ గెలుపు
ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ అర్జున్ యాదవ్ (135 బంతుల్లో 101 నాటౌట్; 4 ఫోర్లు,1 సిక్స్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో ఈఎంసీసీ జట్టుపై గెలుపొందింది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 424/4తో బరిలోకి దిగిన ఆంధ్రాబ్యాంక్... అర్జున్ చెలరేగడంతో ఇన్నింగ్స్‌ను 581/8 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అమోల్ షిండే (43) ఫర్వాలేదనిపించాడు. ఈఎంసీసీ బౌలర్ రవితేజ 3 వికెట్లు తీసుకున్నాడు.అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈఎంసీసీ జట్టుకు ఆంధ్రా బ్యాంక్ బౌలర్లు అమోల్ షిండే (5/46), కనిష్క్ యాదవ్ (4/38) ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఈఎంసీసీ 192 పరుగుల వద్ద ఆలౌటైంది. సూర్యతేజ (60), ఆకాశ్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకుముందు ఈఎంసీసీ తన తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ విజయంతో ఆంధ్రా బ్యాంక్ 15 పాయింట్లను దక్కించుకోగా... ఈఎంసీసీ 4 పాయింట్లతో సరిపెట్టుకుంది. షాదాబ్ కదంతొక్కినా... ఎస్‌బీహెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మన్ షాదాబ్ తుంబి (142 బంతుల్లో 111 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. ఎస్బీహెచ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 197/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ 309 పరుగుల వద్ద ఆలౌటైంది. సందీప్ రాజన్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో డెక్కన్ 155 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్బీహెచ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. సుమన్ (83 నాటౌట్), అనూప్ (63 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌తో ఎస్‌బీహెచ్‌కు 12 పాయింట్లు, డెక్కన్ క్రానికల్‌కు 4 పాయింట్లు దక్కాయి.