సాక్షి, హైదరాబాద్: అనుభవం లేని ఆటగాళ్లు, అర్హత లేని కోచ్ అర్జున్ యాదవ్ కారణంగానే రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూస్తోందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణమే అర్జున్ యాదవ్‌ను తొలగించి అన్ని అర్హతలు ఉన్న కోచ్‌ను హైదరాబాద్‌కు నియమించాలని ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)ను కోరారు. ‘పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఇన్నింగ్స్ 125 పరుగులతో ఓడటం సిగ్గుచేటు.
అనుభవం లేని క్రికెటర్లు జట్టులో ఉన్నారు. హెచ్‌సీఏ కక్ష సాధింపు ధోరణిని విడిచిపెట్టి అనువజు్ఞడైన అంబటి రాయుడును తిరిగి హైదరాబాద్ జట్టులో ఆడించాలి. కోచ్ అర్జున్ యాదవ్‌ను కూడా వెంటనే తప్పించి ఆయన స్థానంలో అర్హత ఉన్న మరో కోచ్‌ను నియమించాలి. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో మాట్లాడి హైదరాబాద్ రంజీ జట్టులోకి రాయుడును తీసుకొచ్చే అంశంపై కేటీఆర్ శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నా. ఇలా చేస్తేనే హైదరాబాద్ జట్టుకు మేలు జరుగుతుంది’ అని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment