PC: IPL Twitter
IPL 2023 LSG Vs MI- Eliminator: లక్నో సూపర్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా ఇవాళ (మే 24) జరుగనున్న ఐపీఎల్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి..? గత రికార్డులు ఏం చెబుతున్నాయి..? ఈ వివరాలను పరిశీలిస్తే.. ప్రస్తుత సీజన్‌లో లక్కు కొద్ది (గుజరాత్ ఆర్సీబీని ఓడగొట్టడంతో) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైతో పోలిస్తే.. సీఎస్‌కేతో సమానంగా సత్తా చాటి ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నోకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయనేది జనాల అభిప్రాయం.
రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో సైతం అద్భుతంగా రాణిస్తున్న లక్నో.. కేవలం ఒక్కరిపై ఆధారపడకుండా సమష్ఠిగా విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో లక్నో ట్రాక్ రికార్డు పరిశీలిస్తే.. వారు గెలిచిన 8 మ్యాచ్‌ల్లో బ్యాటర్లతో సమానంగా బౌలర్లు కూడా సత్తా చాటారు. అలాగే ఆ జట్టుకు కొన్ని మ్యాచ్‌ల్లో లక్ కూడా కలిసొచ్చింది. దీపక్ హుడా లాంటి అంచనాలు కలిగిన బ్యాటర్లు విఫలమైనా.. బ్యాటింగ్‌లో స్టోయినిస్, పూరన్, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్.. బౌలింగ్‌లో బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ నిలకడగా సత్తా చాటారు. లక్నో పేస్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, స్పిన్నర్లు ఆ లోటును భర్తీ చేస్తున్నారు.
ముంబై విషయానికొస్తే.. రోహిత్ సేనలో నాణ్యమైన బౌలర్లు లేనప్పటికీ, వారు పటిష్టమైన బ్యాటింగ్ విభాగంతో మ్యాచ్‌లు గెలిచారు. వీరికి కూడా లక్ భారీగా కలిసొచ్చింది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్న ముంబై అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్, బెహ్రెన్‌డార్ఫ్, పియూష్ చావ్లా.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, గ్రీన్, ఇషాన్ కిషన్, నేహల్ వధేరా లాంటి వారు ముంబై విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.
సూర్యకుమార్ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉండగా.. రోహిత్ శర్మ నిలకడలేమి, నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం లేకపోవడం ఆ జట్టుకు ప్రధాన లోటుగా చెప్పవచ్చు. అయినా వీరిదైన రోజున బ్యాటర్లు తెగిస్తే వీరిని ఆపడం చాలా కష్టం. ఇక, గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 3 సందర్భాల్లో గెలుపు లక్నోనే వరించింది.
Comments
Please login to add a commentAdd a comment