
సిరాజ్‌తో కోహ్లి (PC: RCB X)
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.
రాజస్తాన్ రాయల్స్‌తో అమీ తుమీ
ఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది.
ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి 708 పరుగులు సాధించాడు.
తద్వారా టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే
‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.
ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.
బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్‌కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను.
బేసిక్స్ మర్చిపోను
కంప్యూటర్ అనాలసిస్‌తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్‌ను నేనెప్పుడూ మర్చిపోను.
వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀
Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?
📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024