ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సోమవారం సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌లో సీఎస్‌కే 12 పరుగులతో గెలిచి సీజన్‌లో బోణీ కొట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఇందులో వైడ్లు 20 ఉంటే.. సీఎస్‌కేవి 13 కాగా.. లక్నోవి ఏడు వైడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ 13 వైడ్స్ ఇవ్వకపోయుంటే 25 పరుగులతో గెలిచి ఉండేది. అలా అయితే రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండేది.
ఇక తమ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంపై సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ..'' తర్వాతి మ్యాచ్ నుంచి మా బౌలర్లు నోబాల్స్, వైడ్స్ ఎక్కువగా వేస్తే ఊరుకోను. నేను కెప్టెన్ పదవి నుంచి దిగిపోతా. అప్పుడు వేరే కెప్టెన్ నేతృతంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా జరిగితే తప్పుకుంటా'' అంటూ జట్టును హెచ్చరించాడు.
ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక యూనిక్ ఐడియా ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.'' మ్యాచ్‌లో బౌలర్లు రెండు లేదా మూడు వైడ్స్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీహిట్ ఇవ్వండి.. అప్పుడు బౌలర్లు ఆటోమెటిక్‌గా దారిలోకి వస్తారు. నియంత్రణతో బౌలింగ్ వేయడం చూస్తాం.'' అంటూ పేర్కొన్నాడు. కాగా లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో దీపక్ చహర్ వరుసగా మూడు వైడ్స్ వేసిన సమయంలో సునీల్ కామెంట్రీలో ఇలా స్పందించాడు.
పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాత్రం..'' వినడానికి హాస్యాస్పదంగా'' ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బిషప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సునీల్.. ''ఇలాంటి వైడ్స్, నోబాల్స్ వల్ల మ్యాచ్ సమయం చాలా వృథా అవుతుంది. అందుకే నేను చెప్పింది మంచి ఆలోచనే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే మంచిది'' అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. అయితే సునీల్ గావస్కర్ ఐడియాపై కొందరు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వాట్ యాన్ ఐడియా సర్ జీ.. దెబ్బకు బౌలర్లు దారిలోకి రావడం ఖాయం.'' అంటూ పేర్కొన్నారు.
ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు పలు కొత్త రూల్స్ వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ అనే రూల్‌ను ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇంపాక్ట్ రూల్‌ను అన్ని జట్లు విరివిగా వాడేస్తున్నాయి. ఇక వైడ్, నోబాల్స్ విషయంలోనూ ఆటగాళ్లు డీఆర్‌ఎస్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment