Ian Bishop
-
టీ20 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్ అతడే..!
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ 2024పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు.. పలానా బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడు.. పలానా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా జోస్యాల మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా స్పందించాడు.బిషప్ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్కు చెప్పి క్రికెట్ సర్కిల్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉంటాడని బోల్డ్ స్టేట్మెంట్ చేశాడు. మరో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్‌గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్ లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని ముక్తకంఠంతో వాదిస్తుంటే.. బిషప్ మాత్రం కుల్దీప్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్పై కూడా బిషప్ తన అంచనాను అందరికీ భిన్నంగా వెల్లడించాడు. ఈ విభాగంలో మెజారిటీ శాతం విరాట్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్‌ల పేర్లు చెబుతుంటే బిషప్ మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు చెప్పి అందరి అంచనాల్లో తన అంచనా వేరని నిరూపించాడు. సెమీఫైనలిస్ట్‌ల విషయంలోనూ బిషప్ అంచనా కాస్త వైవిధ్యంగా ఉంది. ఈసారి ఫైనల్ ఫోర్కు భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చేరతాయని బిషప్ చెప్పుకొచ్చాడు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం టీమిండియా జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ కోసం ఇదివరకే న్యూయార్క్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు. -
'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సోమవారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌లో సీఎస్కే 12 పరుగులతో గెలిచి సీజన్లో బోణీ కొట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఇందులో వైడ్లు 20 ఉంటే.. సీఎస్కేవి 13 కాగా.. లక్నోవి ఏడు వైడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ 13 వైడ్స్ ఇవ్వకపోయుంటే 25 పరుగులతో గెలిచి ఉండేది. అలా అయితే రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండేది. ఇక తమ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ..'' తర్వాతి మ్యాచ్ నుంచి మా బౌలర్లు నోబాల్స్, వైడ్స్ ఎక్కువగా వేస్తే ఊరుకోను. నేను కెప్టెన్ పదవి నుంచి దిగిపోతా. అప్పుడు వేరే కెప్టెన్ నేతృతంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా జరిగితే తప్పుకుంటా'' అంటూ జట్టును హెచ్చరించాడు. ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక యూనిక్ ఐడియా ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.'' మ్యాచ్‌లో బౌలర్లు రెండు లేదా మూడు వైడ్స్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీహిట్ ఇవ్వండి.. అప్పుడు బౌలర్లు ఆటోమెటిక్‌గా దారిలోకి వస్తారు. నియంత్రణతో బౌలింగ్ వేయడం చూస్తాం.'' అంటూ పేర్కొన్నాడు. కాగా లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో దీపక్ చహర్ వరుసగా మూడు వైడ్స్ వేసిన సమయంలో సునీల్ కామెంట్రీలో ఇలా స్పందించాడు. పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాత్రం..'' వినడానికి హాస్యాస్పదంగా'' ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బిషప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సునీల్.. ''ఇలాంటి వైడ్స్, నోబాల్స్ వల్ల మ్యాచ్ సమయం చాలా వృథా అవుతుంది. అందుకే నేను చెప్పింది మంచి ఆలోచనే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే మంచిది'' అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. అయితే సునీల్ గావస్కర్ ఐడియాపై కొందరు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వాట్ యాన్ ఐడియా సర్ జీ.. దెబ్బకు బౌలర్లు దారిలోకి రావడం ఖాయం.'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు పలు కొత్త రూల్స్ వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ అనే రూల్‌ను ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇంపాక్ట్ రూల్‌ను అన్ని జట్లు విరివిగా వాడేస్తున్నాయి. ఇక వైడ్, నోబాల్స్ విషయంలోనూ ఆటగాళ్లు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. -
రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి
టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. సెమీఫైన్లలో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా కెప్టెన్సీ పరంగా అంతగా వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌ను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ అప్పజెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషఫప్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతున్నాడని బిషఫ్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో బిషప్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది జూలైలో విండీస్‌తో సిరీస్ సమయంలో రోహిత్‌ను ఓ ప్రశ్న ఆడిగాను. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మేనేజ్ చేయగలవా? అతడు దానికి బదులుగా అది చాలా కష్టం అని సమాధానం చెప్పాడు. మూడు ఫార్మాట్ల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్హహించడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత ఆటపై ప్రభావం చూపుతోంది. రోహిత్ విషయంలో కూడా ఇదే జరిగింది. మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. రోహిత్ వయస్సు దృష్ట్యా అతడి స్థానంలో కొత్త సారథిని భారత్ తయారు చేసుకుంటే బాగుటుంది. నాకు అడిగితే రిషబ్ పంత్ లేదా హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్‌లకు టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే బెటర్" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: భారత్‌తో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ కెప్టెన్ దూరం! స్టార్ బౌలర్ కూడా! -
విమర్శలు పట్టించుకోకు కోహ్లి.. నువ్వేంటో నిరూపించు.. అప్పుడే: అక్తర్
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు చేయడం సరికాదని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లి ఫామ్‌లేమి గురించి విమర్శించే వారు.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలన్నాడు. ఓ క్రికెటర్‌గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందేందుకు కోహ్లి అర్హుడని పేర్కొన్నాడు. కాగా గతేడాది నుంచి ఫామ్‌లేమితో ఈ ‘రన్‌మెషీన్’ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానన్న కోహ్లి.. మెగా టోర్నీలో ఘోర పరాభవంతో సారథ్య బాధ్యతలకు ముగింపు పలికాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సారథిగా వ్యవహరించిన కోహ్లి.. గతేడాది ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు. ఇక కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఈ సీజన్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2022లో పదహారు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు 341. సగటు 22.73. కేవలం రెండు అర్ధ శతకాలు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. అతడు అంతర్జాతీయ క్రికెట్లో 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. ‘‘110 సెంచరీలకు చేరువయ్యే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను తారస్థాయిలో విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు. నువ్వు దీపావళి గురించి ట్వీట్ చేసినా అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్‌కప్‌లో ఓడిపోతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీదైన శైలిలో ముందుకు సాగు. విరాట్ కోహ్లి అంటే ఏంటో వాళ్లకు ఒక్కసారి చూపించు’’ అని అక్తర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1 ఘోర పరాజయం -
'కోహ్లి బ్యాటింగ్ చూస్తే జాలేస్తోంది..'
ఐపీఎల్ 2022లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాణించడంలో విఫలమయ్యాడు. ఆరంభంలో డుప్లెసిస్‌తో కలిసి మంచి ఆరంభం ఇచ్చినప్పటికి.. అదే జోరును మ్యాచ్ మొత్తం చూపెట్టలేకపోయాడు. 33 బంతుల్లో 30 పరుగులతో వన్డే తరహాలో ఆడిన కోహ్లి చివరకు ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గతేడాది చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఇదే తరహాలో మొయిన్ అలీ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. ఇక సీఎస్కేతో మ్యాచ్‌లో కోహ్లి 16 డాట్ బంతులు ఆడాడు. ఇక గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అనవసర రన్‌కు పిలిచి రనౌట్ అవ్వడానికి ప్రధాన కారణమయ్యాడు. మహిపాల్ లామ్రోర్, రజత్ పాటిదార్, దినేష్ కార్తిక్‌లు రాణించి ఉండకపోతే ఆర్సీబీ పరిస్థితి వేరుగా ఉండేది.కాగా కోహ్లి ఈ సీజన్లో తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 178 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి .. సీజన్లో తక్కువ స్కోరు నయోదు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి బ్యాటింగ్ తీరుపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి బ్యాటింగ్ చూస్తుంటే జాలేస్తోంది. స్పిన్ ఆడడంలో కింగ్‌గా కనిపించిన కోహ్లికి ఇప్పుడదే పెద్ద వీక్నెస్గా మారింది. ఒక సీమర్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా సూపర్ సిక్స్ కొట్టిన కోహ్లి.. ఆ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బౌండరీలు కొట్టలేని స్థితిలో సింగిల్స్‌తోనే వేగంగా ఆడే కోహ్లి ఇప్పుడు కనిపించడం లేదు. కోహ్లి ఫిప్టీ కొడితే అందులో 10-15 పరుగులు కేవలం సింగిల్స్ రూపంలో వచ్చేవి. అలాంటి కోహ్లి స్పిన్ బౌలింగ్‌లో ఫేలవంగా ఆడుతున్నాడు. అయితే అతనికి ఇది కొత్త మాత్రం కాదు. గత సీజన్‌తో పాటు.. పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్పిన్ ఆడడంలో విఫలమవుతూ వస్తున్నాడు. అందుకే కోహ్లిని చూస్తే జాలేస్తోంది అనే పదం వాడాల్సి వచ్చింది.'' అంటూ పేర్కొన్నాడు. -
IPL 2022: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి
IPL 2022 DC Vs KKR- Rovman Powell: వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్‌లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. ఇందులో రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా 20, 3, 8, 0, 36 పరుగులు చేశాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పావెల్‌ను కొనియాడాడు వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్. పేదరికాన్ని జయించి తన తల్లి, చెల్లి బాగోగులు చూసుకుంటున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఈ మేరకు బిషప్ మాట్లాడుతూ.. ‘‘మీలో ఎవరికైనా ఓ పది నిమిషాల సమయం ఉంటే.. వెళ్లి రోవ్‌మన్ యూట్యూబ్‌లో ఉన్న రోవ్‌మన్ పావెల్ లైఫ్‌స్టోరీ చూడండి. నేను.. నాతోపాటు మరికొంత మంది పావెల్ ఐపీఎల్ ఆడాలని ఎందుకు కోరుకున్నారో.. అతడు అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారో మీకే తెలుస్తుంది. చిన్న స్థాయి నుంచి అతడు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చాడు. తాను సెకండరీ స్కూళ్లో ఉన్నపుడే పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తానంటూ తన తల్లికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు’’ అని పావెల్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. పేదరికాన్ని జయించి జమైకాలోని ఓల్డ్ హార్బర్లో గల బానిస్టర్ జిల్లాలో 1993, జూలై 23న పావెల్ జన్మించాడు. అతడి తల్లి సింగిల్ పేరెంట్. పావెల్‌తో పాటు ఆమె ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని పెంచి పెద్ద చేసింది. చిన్న ఇంట్లో తల్లి ఇబ్బందులు చూస్తూ పెరిగిన పావెల్.. ఆమె ప్రశాంత జీవితం గడిపేలా అన్ని సౌకర్యాలు ఉన్న జీవితం అందించాలనే తలంపుతో చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానిని నిజం చేసుకుని తల్లి, చెల్లిని బాగా చూసుకుంటున్నాడు. పావెల్ జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను కరేబియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ సమయంలో డాక్యుమెంటరీ రూపొందించారు. ఇక పావెల్ కెరీర్ విషయానికొస్తే.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైన పావెల్.. ఐపీఎల్ మెగా వేలం-2022లో తన పేరు నమోదు చేసుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. రూ. 2.8 కోట్లు ఖర్చు చేసి పావెల్‌ను సొంతం చేసుకుంది. చదవండి👉🏾 Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ A return to winning ways for the Delhi Capitals! 👏 👏 The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. 👍 👍 Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P — IndianPremierLeague (@IPL) April 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు కష్టమే!
రాజస్తాన్ రాయల్స్.. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టు. అయితే ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాత మారింది. వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకువచ్చిందీ సంజూ శాంసన్ బృందం. ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్ జట్టుకు కలిసి వస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాట్ విదిలించడం, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లు రాణిస్తుండటం.. టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, యజువేంద్ర చహల్ చేరడంతో మరింత బలం పుంజుకుంది. వ్యక్తిగతంగానూ సంజూ శాంసన్‌కు ఈ సీజన్ బాగా కలిసి వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి అతడు 228 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 55. అయితే, రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఈ ప్రదర్శన సరిపోదని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డాడు. రిషభ్ పంత్ రూపంలో తీవ్రమైన పోటీ ఉన్న తరుణంలో ఈ వికెట్ కీపర్ బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు. షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో సంజూ అవుటైన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఈ మేరకు ఇయాన్ బిషప్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ దానిని కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. నిలకడగా ఆడలేకపోతున్నాడు. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నాడు. జోస్ బట్లర్ పెద్దగా స్కోర్ చేయనప్పుడు సంజూ ఆ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. సంజూ ఇప్పుడు కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ.. వనిందు హసరంగ బౌలింగ్‌లో అవుటైన తీరు షాట్ సెలక్షన్ విషయంలో అతడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి హెచ్చరిస్తోంది. నిజానికి నేను సంజూ శాంసన్‌కు అభిమానిని. ఎన్నో ఏళ్లుగా తన ఆటను గమనిస్తున్నా. జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాన్ని అతడు చేజేతులా దూరం చేసుకుంటున్నాడనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో హసరంగ బౌలింగ్‌ను తప్పుగా అంచనా వేసిన సంజూ.. రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 56 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీపై రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి👉🏾 IPL 2022: వాళ్లు అదరగొడుతున్నారు.. ఆ మూడు జట్లే ఫేవరెట్.. ఎందుకంటే! చదవండి👉🏾IPL 2022: వేలంలో ఏమిటో ఇదంతా అనుకున్నా.. కానీ ఇప్పుడు ఆ రెండు జట్లు సూపర్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 39.@rajasthanroyals take this home by 29 runs. Scorecard - https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/9eGWXFjDCR — IndianPremierLeague (@IPL) April 26, 2022