వింటేజ్‌ మహి.. ధోని మెరుపు ఇన్నింగ్స్‌! వీడియో వైరల్‌ | MS Dhoni hits 101m six in sensational 9 ball 28 runs | Sakshi
Sakshi News home page

#MS Dhoni: వింటేజ్‌ మహి.. ధోని మెరుపు ఇన్నింగ్స్‌! వీడియో వైరల్‌

Published Fri, Apr 19 2024 9:49 PM | Last Updated on Fri, Apr 19 2024 9:49 PM

MS Dhoni hits 101m six in sensational 9 ball 28 runs - Sakshi

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని మరోసారి అదరగొట్టాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన మిస్టర్‌ కూల్‌.. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(57) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ధోని(28), మొయిన్‌ అలీ(30) పరుగులతో రాణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement