భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిషేదించాలి: పాక్‌ | Pakistani fans want ICC to ban international cricket in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిషేదించాలి: పాక్‌ అభిమానులు

Published Sat, Oct 14 2017 10:03 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

 Pakistani fans want ICC to ban international cricket in India - Sakshi

లాహోర్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ అనంతరం కొందరు ఆకతాయిలు రాయి విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్నే ఆసరాగా తీసుకుంటూ.. పాక్‌ అభిమానులు ట్విట్టర్‌ వేదికగా భారత్‌పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిచడానికి వీలు లేదు. అక్కడ ఆటగాళ్లకు భద్రత కరువైంది. భారత్‌లో ఉగ్రవాద చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఐసీసీ వెంటనే భారత్‌లో​ క్రికెట్‌పై నిషేదం విధించాలి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

ఇక వరల్డ్‌ ఎకానమీ ఫోరం సంస్థ చేసిన సర్వేలో పర్యాటక దేశాల్లో ప్రపంచంలోనే నాలుగో ప్రమాదకరమైన దేశంగా పాకిస్థాన్‌ నిలిచింది. అలాంటి దేశం భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించొద్దని, అక్కడ ఆటగాళ్లకు భద్రత లేదని అంటోందా అని భారత అభిమానులు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. గతంలో శ్రీలంక క్రికెట్‌ ఆటగాళ్లపై పాక్‌లో ఉగ్రదాడి జరగడంతో ఐసీసీ ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాక్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు పీసీబీ తీవ్రంగా శ్రమిస్తుస్తోంది. ఈ మధ్యే ప్రపంచ ఎలెవన్‌ జట్టు పాక్‌లో పర్యటించి టీ20 సిరీస్‌ ఆడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement