
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ 2021) వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. పీఎస్‌లో పాల్గొన్న 7గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పీఎస్‌ఎల్ 2021ని వాయిదా వేస్తున్నట్లుగా పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 20న ఆరంభమైన పీఎస్‌ఎల్ మార్చి 22 వరకు కొనసాగాల్సింది. తాజా నిర్ణయంతో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. గత ఏడాది కూడా పీఎస్‌ఎల్ ప్రారంభమై కరోనా కేసులతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో టోర్నీని వాయిదా వేశారు. మిగిలిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ 2020లో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment