
పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్
సాక్షి, స్పోర్ట్స్: ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన వెస్టిండీస్ పేస్ బౌలర్, స్పీడ్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కు దూరమయ్యాడు. పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీస్ క్రికెటర్ అనారోగ్యం కారణంగా తాజా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు క్వెట్టా గ్లాడియేటర్స్ ట్వీట్ చేసింది. పీఎస్‌ఎల్‌లో రెండు మ్యాచ్‌లాడిన జోఫ్రా ఆర్చర్.. 2/30, 3/23 తో ఆకట్టుకున్నాడు.
కడుపులో ఏదో సమస్య కారణంగా పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న విండీస్ బౌలర్ ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో ఫాస్ట్ బౌలర్ ఆర్కర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఈ విండీస్ పేసర్ కోలుకుని అందుబాటులోకి వస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై ఆర్చర్ ఏ విధంగానూ స్పందించడం లేదు. బౌలింగ్‌లో తనకు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఆదర్శమని ఆర్చర్ చెబుతుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment