షాహిద్ అఫ్రిది (ఫైల్ ఫొటో)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన పరుష వ్యాఖ్యలతో భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. రెండు రోజుల క్రితమే కశ్మీర్‌పై సంచలన ట్వీట్ చేసిన ఈ పాక్ మాజీ ఆటగాడు ఈ సారి ఐపీఎల్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశమిచ్చినా తాను ఆడనని పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఐపీఎల్ కన్నా పెద్ద టోర్నీగా అవతరిస్తోందని జోస్యం చెప్పాడు. ఈ విషయాన్ని సదరు వెబ్‌సైట్ ఎడిటర్ సాజ్ సదిఖ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
‘వారు ఒక వేళ ఐపీఎల్‌లో ఆడాలిని పిలిచినా.. నేను వెళ్లను. మా పీఎస్‌ఎల్ భవిష్యత్తులో ఐపీఎల్ కన్నా పెద్ద లీగ్‌గా అవతరిస్తోంది. నేను ప్రస్తుతం పీఎస్‌ఎల్‌ను ఆస్వాదిస్తున్నాను. నాకు ఐపీఎల్ ఆడాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఐపీఎల్ అంటేనే ఆస్తక్తి లేదు.’ అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. తాను దేశ సైనికుడి వంటి వాడినని, తన దేశమంటే తనకెంతో గౌరవమని అప్రిదీ తెలిపాడు. పాకిస్తాన్ తనకన్నీ ఇచ్చిందని, ఒకవేళ తాను క్రికెటర్‌ను కాకుంటే పాక్ సైన్యంలో చేరేవాడినని పేర్కొన్నాడు.
గతంలో అఫ్రిది ఇదే ఐపీఎల్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. ‘నేనొక్కసారే ఐపీఎల్‌లో ఆడా. కానీ ఇది ఓ గొప్ప టోర్నీ.. ఈ లీగ్‌లో ఆడటంతో ప్రత్యేక అనూభూతి కలిగింది.’ అని ఈ క్యాష్ రిచ్ లీగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక అఫ్రిది ఐపీఎల్ తొలి సీజన్‌లో అప్పటి డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే అఫ్రిది ఐపీఎల్‌పై తనకున్న అభిప్రాయాన్ని ఇలా యూటర్న్ చేసుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కశ్మీర్ వ్యవహారంలో తల దూర్చి సొంత అభిమానుల ఆగ్రహానికే గురైన అఫ్రిదిపై.. భారత క్రికెటర్లు సైతం తమదైన శైలిలో మండిపడ్డారు. ఇక భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న వివాదంతో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌కు అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే.
Shahid Afridi "Even if they call me, I won't go to the IPL. My PSL is the biggest and there will be a time that it leaves the IPL behind. I am enjoying the PSL, I don't have any need for the IPL. I'm not interested in it and never was" #Cricket
— Saj Sadiq (@Saj_PakPassion) 4 April 2018
Comments
Please login to add a commentAdd a comment