చైనాలో క్రికెట్‌ను ఏమంటారో తెలుసా అంటూ టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశాడు. చైనాలో క్రికెట్‌కు అంతగా ఆదరణ ఉండదన్న విషయం అందరికి తెలసిందే. అయితే అనూహ్యంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఇద్దరు చైనా ప్లేయర్లు టోర్నీ మధ్యలో భాగస్వాములయ్యారు. క్రికెట్‌ను విస్తరించాలని పీఎస్‌ఎల్ జట్టైన పెషావర్ జాల్మీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చైనా ఆటగాళ్లు యూఫై జాంగ్, జియాన్ లీలను ఎంపికచేసింది.