
యువరాజ్ సింగ్ (ఫైల్)
సాక్షి, స్పోర్ట్స్ : చైనాలో క్రికెట్‌ను ఏమంటారో తెలుసా అంటూ టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశాడు. చైనాలో క్రికెట్‌కు అంతగా ఆదరణ ఉండదన్న విషయం అందరికి తెలసిందే. అయితే అనూహ్యంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఇద్దరు చైనా ప్లేయర్లు టోర్నీ మధ్యలో భాగస్వాములయ్యారు. క్రికెట్‌ను విస్తరించాలని పీఎస్‌ఎల్ జట్టైన పెషావర్ జాల్మీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చైనా ఆటగాళ్లు యూఫై జాంగ్, జియాన్ లీలను ఎంపికచేసింది.
ఈ నేపథ్యంలో చైనాలో క్రికెట్ ఆడుతారా? చైనాలో క్రికెట్ ను ఏమని పిలుస్తారు? అంటూ పీఎస్ఎల్ లో యాంకర్ ఆ క్రికెటర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. చైనాలో క్రికెట్ ఆడుతారని యూఫై జాంగ్ తెలిపాడు. క్రికెట్ ను చైనాలో ''భాంచో'' అంటారని అన్నాడు. దీంతో యాంకర్ బిత్తరపోయాడు. పాకిస్తాన్ లో అదొక బూతు పదం. ఎవరి సోదరినైనా తిట్టాలంటే ఇంచుమించు ఆ పదంతో తిడుతుంటారు. కొంత మంది ఆ బూతును ఊతపదంగా వినియోగిస్తుంటారు. దీంతో 'ఏమంటారు?' అని మళ్లీ అడిగి స్పష్టంగా విన్నాడు. ఈ సమాధానికి యువరాజ్ సింగ్ నవ్వాపుకోలేక పోయాడు. తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తూ, 'పంజాబీ పదంలా ఉంది కదా' అంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment