
మెల్‌బోర్న్: క్రీడాంశాల్లో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వేలాదిగా తరలివచ్చే అభిమానులు ఆటగాళ్ల అదిరిపోయే ఫీట్లకు ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బౌండరి లైన్ వద్ద ఒడిసిపట్టే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా బిగ్‌బాష్ వుమెన్స్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్ క్రీడాకారిణి బ్రిడ్జెట్ ప్యాటర్సన్ పట్టిన క్యాచ్ వహ్వా! అనిపిస్తుంది.
సిడ్నీ థండర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్యాటర్సన్.. ఇసబెల్లా వాంగ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో ఒడిసిపట్టింది. సిక్సర్‌గా బౌండరీ లైన్ ఆవల పడుతున్న బంతిని ప్యాటర్సన్ అడ్డుకుంది. బ్యాలన్స్ కోల్పోతున్న తరుణంగా దానిని గాల్లోకి నెట్టి.. వెనక్కి అడుగేసింది.
లిప్తపాటులో మళ్లీ తిరిగొచ్చి క్యాచ్ పట్టింది. ఇసబెల్లాను వెనక్కి పంపింది. ఈ క్యాచ్ ఫీట్‌పై నెటిజన్లు, సహచర ఆటగాళ్ల నుంచి ప్యాటర్సన్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగా.. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది.
Bridget Patterson walks the boundary tightrope - and catches a classic! #OhWhatAFeeling | @Toyota_Aus | #WBBL07 pic.twitter.com/C7FzpZket6
— cricket.com.au (@cricketcomau) October 16, 2021
Comments
Please login to add a commentAdd a comment