మహిళల బిగ్‌బాష్ లీగ్ సరికొత్త ఛాంపియన్స్‌గా ఆడిలైడ్ స్ట్రైకర్స్ అవతరించింది. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆడిలైడ్ స్ట్రెకర్స్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది.
అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటర్లలో డాటిన్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సిడ్నీ బౌలర్లలో ఎక్లెస్టోన్ రెండు, పెర్రీ, బోల్టాన్, కేట్ పీటర్సన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 137 పరుగులకు ఆలౌటైంది. సిడ్నీ బ్యాటర్లలో బ్రౌన్(34) పరుగులతో టాప్ రాణించింది.
అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, డాటిన్ తలా రెండు వికెట్లు సాధించగా.. స్కాట్, మెక్‌గ్రాత్, వెల్లింగటన్ చెరో వికెట్ సాధించారు. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్‌కు చెందిన దియోంద్ర డాటిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ అష్లే గార్డ్‌నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది.
చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment