T20 tournment
-
బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా అడిలైడ్ స్ట్రైకర్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ సరికొత్త ఛాంపియన్స్‌గా ఆడిలైడ్ స్ట్రైకర్స్ అవతరించింది. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆడిలైడ్ స్ట్రెకర్స్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటర్లలో డాటిన్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సిడ్నీ బౌలర్లలో ఎక్లెస్టోన్ రెండు, పెర్రీ, బోల్టాన్, కేట్ పీటర్సన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 137 పరుగులకు ఆలౌటైంది. సిడ్నీ బ్యాటర్లలో బ్రౌన్(34) పరుగులతో టాప్ రాణించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, డాటిన్ తలా రెండు వికెట్లు సాధించగా.. స్కాట్, మెక్‌గ్రాత్, వెల్లింగటన్ చెరో వికెట్ సాధించారు. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్‌కు చెందిన దియోంద్ర డాటిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ అష్లే గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది. చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్
క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం గొప్ప.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు అరుదైన ఫీట్.. మరి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే అద్భుతం అనాల్సిందే. అందుకే అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు.. మరి ఆ అద్బుతాన్ని సాధించింది ఎవరంటే మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్. నిజానికి వీరన్‌దీప్ సింగ్ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల క్లబ్లో జాయిన్ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం. నేపాల్ ప్రొ కప్ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవెన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగింది. వీరన్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రాకముందు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్ తొలి బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్ సింగ్ హ్యట్రిక్ నమోదు చేయడం విశేషం. హ్యాట్రిక్ సాధించిన తర్వాత వీరన్ షాహిద్ అఫ్రిది సెలబ్రేషన్‌ను గుర్తు చేశాడు. మొత్తానికి వీరన్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్ స్లిప్ క్యాచ్, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్ రూపంలో సాధించాడు. 2⃣0⃣th Over 6⃣ Balls 6⃣ Wickets 4⃣ in 4⃣ from the final 4 for the bowler 1⃣ Run Out Unbelievable stuff from @Viran23 for the @MalaysiaCricket XI here in Bhairahawa, Nepal! Surely the first time in Cricket History there's been 6 Wickets in 6 Balls!?? pic.twitter.com/pVIsdlyEwt — Andrew Leonard (@CricketBadge) April 12, 2022 -
ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో
లండన్: ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ మాత్రం యార్క్‌షైర్ తరపున ఆడుతూ టీ20 బ్లాస్ట్ 2021లో బిజీగా ఉన్నాడు. జో రూట్లో మంచి ఆఫ్ స్పిన్నర్ దాగున్న సంగతి మనం టీమిండియాతో టెస్టు సిరీస్‌లో చూశాము. తాజాగా యార్క్‌షైర్ తరపున మూడు మ్యాచ్‌లు ఆడిన రూట్ 65 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక లీస్టర్‌షైర్ ఫాక్సెస్తో జరిగిన మ్యాచ్‌లో రూట్ తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌లో ఎవరు ఊహించని విధంగా బౌన్సర్‌తో మెరిశాడు. కానీ ఆ బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆరోన్ లిల్లీ బౌండరీ తరలించాడు. రూట్ వేసిన ఆ ఓవర్లో సిక్స్, ఫోర్ సహా మొత్తం 10 పరుగులు వచ్చాయి. కాగా రూట్ వేసిన బౌన్సర్‌పై కామెంటేటర్స్‌తో పాటు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో లీస్టర్‌షైర్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 173 పరుగులకే పరిమితమైంది. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు -
ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్
డబ్లిన్ : భారీ సిక్సర్లకు కేరాఫ్‌గా ఉండే ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒబ్రెయిన్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మ్యాచ్ గెలిచినందుకు సంతోషించాలా లేక కారు అద్దం పగిలినందుకు బాధపడాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అదేంటి మ్యాచ్ గెలిపించినందుకు సంతోషించాలి గానీ ఇలా సందిగ్ధంలో ఉండడం ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో గురువారం డబ్లిన్ వేదికగా నార్త్‌వెస్ట్ వారియర్స్, లీన్స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన లీన్స్టర్ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు.దీంతో 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్త్‌వర్త్ లూయిస్ ప్రకారం లీన్స్టర్ జట్టు 24 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్‌లో స్టార్ ఆఫ్ ది పర్సన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కెవిన్ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. అద్దం పగిలిన కారు కెవిన్ ఓబ్రెయిన్దే. పాపం అతను కొట్టిన సిక్స్ తన కారు అద్దం ధ్వంసం చేస్తుందని అతను కూడా ఊహంచి ఉండడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్ పార్క్ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళ్లి జరిగిందంతా వివరించాడు. Didn’t need the air-con on the drive up to you lads. 🤣 unreal service once again. Never fails to disappoint. I’ll park further away next time 😝 #BestInTheBusiness https://t.co/tNKTG0tRLA — Kevin O'Brien (@KevinOBrien113) August 27, 2020 కారును ఇన్సురెన్స్ కోటా కింద రిపేయిరింగ్కు తరలించారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్నిఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్విటర్లో షేర్ చేసింది. దీనిపై కెవిన్ సరదాగా స్పందించాడు.' ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్ నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్ ఆవల చాలా దూరంలో పార్క్ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'పాపం కెవిన్ .. భారీ సిక్సులతో విరుచుకుపడే కెవిన్‌కు ఎంత కష్టం వచ్చింది.. ఆ ఒక్క సిక్స్ అతని పాలిట శాపమైంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : తండ్రి కాబోతున్న కోహ్లి, ఆసీస్ టెన్షన్) (తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) -
సెప్టెంబర్‌లో ఐపీఎల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఇంకా కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో... ఐపీఎల్‌కు శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా నిలిచే అవకాశముందని... సెప్టెంబర్ తొలి వారంలో ఈ టోర్నీ జరగొచ్చని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం మైదానాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులు రావొచ్చని నిబంధనలు సడలించింది. దాంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్‌కప్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గావస్కర్ అంచనా వేశారు. ఒకవేళ టి20 ప్రపంచకప్ జరిగితే ఐపీఎల్ నిర్వహణకు కావాల్సినంత సమయం ఉండదని ఆయన అన్నారు. ‘వర్షాకాలంతోపాటు కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా సెప్టెంబర్‌లో భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో శ్రీలంకలో లేదా యూఏఈలో ఈ టోర్నీని నిర్వహించవచ్చు. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండుసార్లు కాకుండా ఒకేసారి తలపడే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది’ అని ఆయన తెలిపారు. -
సీఎల్టీ20కి లాహోర్ లయన్స్
కరాచీ: పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో పాల్గొననుంది. జాతీయ టి20 చాంపియన్ కాకుండా లయన్స్ జట్టును బీసీసీఐ ఆహ్వానించిందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ తెలిపారు. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు మహ్మద్ హఫీజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉమర్, కమ్రాన్ అక్మల్, రియాజ్, అజీజ్ చిమా, జంషేద్, షెహజాద్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. గతంలో సియాల్కోట్ స్టాలిన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ చాంపియన్స్ లీగ్‌లో పాల్గొన్నా... టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. -
హైదరాబాద్ జోరుకు బ్రేక్
తమిళనాడు చేతిలో ఓటమి ముస్తాక్ అలీ ట్రోఫీ సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ(సౌత్‌జోన్)లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్‌కు తమిళనాడు కళ్లెం వేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 30 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యం కానప్పటికీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. రాణించిన బాబా బ్రదర్స్... ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్, తమిళనాడుకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు బాబా అపరాజిత్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) శుభారంభం ఇచ్చినా... అరుణ్ కార్తీక్ (12), దినేశ్ కార్తీక్ (0) హైదరాబాద్ బౌలర్ల ధాటికి విఫలమయ్యారు. తర్వాత వచ్చిన వారిలో బాబా ఇంద్రజిత్ (31 బంతుల్లో 37; 2 సిక్సర్లు), విజయ్ శంకర్ (17 బంతుల్లో 24, 2 ఫోర్లు) రాణించడంతో తమిళనాడు చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లు ఆశిష్ రెడ్డి (2/13), ఓజా (2/23), రవికిరణ్ (2/26) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. రాజన్ మినహా... అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భంగపడింది. పటిష్టమైన జట్టు కర్ణాటకపై మెరుపులు మెరిపించిన అక్షత్ రెడ్డి (15 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడగా, విహారి (6), రవితేజ (2) విఫలమయ్యారు. తమిళనాడు చక్కటి బౌలింగ్‌కు హైదరాబాద్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చివర్లో సందీప్ రాజన్ (27 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదు. తమిళనాడు బౌలర్లలో మూర్తి ప్రభు 3, రాహిల్ షా, విజయ్ శంకర్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు తమిళనాడు ఇన్నింగ్స్: అపరాజిత్ (సి) సందీప్ (బి) ఓజా 28; అరుణ్ కార్తీక్ (సి) రవితేజ (బి) ఆశిష్ 12; దినేశ్ కార్తీక్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 0; ఇంద్రజిత్ (సి) రాహుల్ (బి) భండారి 37; ఐన్‌స్టీన్ (సి) భండారి (బి) ఓజా 19; శంకర్ (సి) రాహుల్ (బి) రవికిరణ్ 24; షారుక్ ఖాన్ (సి అండ్ బి) విహారి 3; మహేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవికిరణ్ 3; ప్రభు నాటౌట్ 7; రాహిల్ షా రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-35, 2-35, 3-53, 4-94, 5-102, 6-117, 7-123, 8-135, 9-139 బౌలింగ్: కనిష్క్ 3-0-20-0, రవికిరణ్ 4-0-26-2, ఆశిష్ 3-0-13-2, విహారి 3-0-31-1, ఓజా 4-0-23-2, భండారి 3-0-21-1 హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (సి) దినేశ్ కార్తీక్ (బి) సునీల్ 22; రవితేజ (బి) రాహిల్ 2; విహారి (సి) రాహిల్ (బి) ప్రభు 6; రాహుల్ (సి) మహేశ్ (బి) ప్రభు 15; సందీప్ (బి) రాహిల్ 34; భండారి (సి) ఐన్‌స్టీన్ (బి) శంకర్ 15; ఆశిష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శంకర్ 0; అహ్మద్ (సి) అరుణ్ (బి) ప్రభు 5; ఓజా నాటౌట్ 5; కనిష్క్ రనౌట్ 1; రవికిరణ్ (బి) మహేశ్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1-23, 2-25, 3-45, 4-48, 5-85, 6-85, 7-102, 8-104, 9-105, 10-109 బౌలింగ్: రాహిల్ షా 4-0-22-2, సునీల్ 3-0-24-1, ప్రభు 4-0-24-3, మహేశ్ 3.3-0-12-1, శంకర్ 2-0-12-2, షారుక్ 2-0-13-0 -
కర్ణాటక చేతిలో ఆంధ్ర ఓటమి
సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్‌జోన్ ట్వంటీ20 టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు కర్ణాటక చేతిలో పరాజయం ఎదురైంది. ఇక్కడి పీవీజీ రాజు-ఏసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 7 వికెట్ల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. తొలుత ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (34 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. ప్రశాంత్ (29), చిరంజీవి (20) ఫర్వాలేదనిపించారు. కర్ణాటక బౌలర్లలో అబ్రార్ కజి 2 వికెట్లు తీయగా, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, శరత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మనీశ్ పాండే (51 బంతుల్లో 60, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (34 బంతుల్లో 41, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సుధాకర్ రెండు వికెట్లు, ప్రవీణ్ ఒక వికెట్ తీశారు. -
రవితేజ అజేయ శతకం
హైదరాబాద్ శుభారంభం తొలి మ్యాచ్‌లో కేరళపై గెలుపు ముస్తాక్ అలీ ట్రోఫీ సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్‌జోన్ ట్వంటీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ శుభారంభం చేసింది. హైదరాబాద్ ఓపెనర్ రవితేజ (68 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దాంతో కేరళతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆల్‌రౌండ్ నైపుణ్యం కనబర్చింది. తొలుత బ్యాటింగ్... అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు అవకాశమివ్వకుండా చెలరేగింది. ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (13)తో ఇన్నింగ్స్ ఆరంభించిన రవితేజ తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (36 బంతుల్లో 47, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 126 పరుగులు జతచేశాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేరళ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ రాకేశ్ (41 బంతుల్లో 48, 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చిచ్చర పిడుగు సంజూ శామ్సన్ (16) విఫలమయ్యాడు. సచిన్ బేబి 24 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఏ దశలోనూ కేరళ లక్ష్యంవైపు సాగలేదు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 3 వికెట్లు పడగొట్టగా... అమోల్ షిండే, ఆశిష్ రెడ్డి, ఆకాశ్ భండారి తలా 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్‌రెడ్డి (బి) బాసిల్ తంపి 13; రవితేజ నాటౌట్ 101; విహారి రనౌట్ 47; ఆశిష్ రెడ్డి నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 179 వికెట్ల పతనం: 1-44, 2-170 బౌలింగ్: బాసిల్ తంపి 4-0-27-1, సందీప్ 3-0-40-0, ప్రశాంత్ 4-0-21-0, పరమేశ్వరన్ 4-0-43-0, రాకేశ్ 4-0-37-0, మనోహరన్ 1-0-9-0. కేరళ ఇన్నింగ్స్: రాకేశ్ (సి అండ్ బి) షిండే 48; జగదీశ్ (సి) రవితేజ (బి) ఆశిష్ 16; శామ్సన్ (సి) రాహుల్ (బి) షిండే 16; జాఫర్ జమాల్ (స్టంప్డ్) అహ్మద్ (బి) భండారి 1; ప్రేమ్ (సి) రాహుల్ (బి) భండారి 15; సచిన్ బేబి (సి) భండారి (బి) ఆశిష్ రెడ్డి 24; మనోహరన్ (సి) విహారి (బి) ఓజా 13; ప్రశాంత్ (స్టంప్డ్) అహ్మద్ (బి) ఓజా 6; బాసిల్ తంపి నాటౌట్ 0; పరమేశ్వరన్ (బి) ఓజా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 145 వికెట్ల పతనం: 1-56, 2-77, 3-81, 4-87, 5-123, 6-125, 7-145, 8-145, 9-145 బౌలింగ్: అమోల్ షిండే 4-0-28-2, రవికిరణ్ 2-0-15-0, కనిష్క్ నాయుడు 3-0-30-0, ఆశిష్ రెడ్డి 4-0-30-2, ప్రజ్ఞాన్ ఓజా 4-0-21-3, ఆకాశ్ భండారి 3-0-19-2.