సీఎల్‌టీ20కి లాహోర్ లయన్స్ | CLT T20 lahore lions | Sakshi
Sakshi News home page

సీఎల్‌టీ20కి లాహోర్ లయన్స్

Published Sun, Jul 20 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

CLT T20 lahore lions

కరాచీ: పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో పాల్గొననుంది. జాతీయ టి20 చాంపియన్ కాకుండా లయన్స్ జట్టును బీసీసీఐ ఆహ్వానించిందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ తెలిపారు.
 
  స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు మహ్మద్ హఫీజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉమర్, కమ్రాన్ అక్మల్, రియాజ్, అజీజ్ చిమా, జంషేద్, షెహజాద్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. గతంలో సియాల్‌కోట్ స్టాలిన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ చాంపియన్స్ లీగ్‌లో పాల్గొన్నా... టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement