తమిళనాడు చేతిలో ఓటమి
ముస్తాక్ అలీ ట్రోఫీ
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ(సౌత్‌జోన్)లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్‌కు తమిళనాడు కళ్లెం వేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 30 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యం కానప్పటికీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది.
రాణించిన బాబా బ్రదర్స్...
ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్, తమిళనాడుకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు బాబా అపరాజిత్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) శుభారంభం ఇచ్చినా... అరుణ్ కార్తీక్ (12), దినేశ్ కార్తీక్ (0) హైదరాబాద్ బౌలర్ల ధాటికి విఫలమయ్యారు. తర్వాత వచ్చిన వారిలో బాబా ఇంద్రజిత్ (31 బంతుల్లో 37; 2 సిక్సర్లు), విజయ్ శంకర్ (17 బంతుల్లో 24, 2 ఫోర్లు) రాణించడంతో తమిళనాడు చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లు ఆశిష్ రెడ్డి (2/13), ఓజా (2/23), రవికిరణ్ (2/26) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.
రాజన్ మినహా...
అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భంగపడింది. పటిష్టమైన జట్టు కర్ణాటకపై మెరుపులు మెరిపించిన అక్షత్ రెడ్డి (15 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడగా, విహారి (6), రవితేజ (2) విఫలమయ్యారు. తమిళనాడు చక్కటి బౌలింగ్‌కు హైదరాబాద్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చివర్లో సందీప్ రాజన్ (27 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదు. తమిళనాడు బౌలర్లలో మూర్తి ప్రభు 3, రాహిల్ షా, విజయ్ శంకర్ చెరో 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
తమిళనాడు ఇన్నింగ్స్: అపరాజిత్ (సి) సందీప్ (బి) ఓజా 28; అరుణ్ కార్తీక్ (సి) రవితేజ (బి) ఆశిష్ 12; దినేశ్ కార్తీక్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 0; ఇంద్రజిత్ (సి) రాహుల్ (బి) భండారి 37; ఐన్‌స్టీన్ (సి) భండారి (బి) ఓజా 19; శంకర్ (సి) రాహుల్ (బి) రవికిరణ్ 24; షారుక్ ఖాన్ (సి అండ్ బి) విహారి 3; మహేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవికిరణ్ 3; ప్రభు నాటౌట్ 7; రాహిల్ షా రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1-35, 2-35, 3-53, 4-94, 5-102, 6-117, 7-123, 8-135, 9-139
బౌలింగ్: కనిష్క్ 3-0-20-0, రవికిరణ్ 4-0-26-2, ఆశిష్ 3-0-13-2, విహారి 3-0-31-1, ఓజా 4-0-23-2, భండారి 3-0-21-1
హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (సి) దినేశ్ కార్తీక్ (బి) సునీల్ 22; రవితేజ (బి) రాహిల్ 2; విహారి (సి) రాహిల్ (బి) ప్రభు 6; రాహుల్ (సి) మహేశ్ (బి) ప్రభు 15; సందీప్ (బి) రాహిల్ 34; భండారి (సి) ఐన్‌స్టీన్ (బి) శంకర్ 15; ఆశిష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శంకర్ 0; అహ్మద్ (సి) అరుణ్ (బి) ప్రభు 5; ఓజా నాటౌట్ 5; కనిష్క్ రనౌట్ 1; రవికిరణ్ (బి) మహేశ్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 109.
వికెట్ల పతనం: 1-23, 2-25, 3-45, 4-48, 5-85, 6-85, 7-102, 8-104, 9-105, 10-109
బౌలింగ్: రాహిల్ షా 4-0-22-2, సునీల్ 3-0-24-1, ప్రభు 4-0-24-3, మహేశ్ 3.3-0-12-1, శంకర్ 2-0-12-2, షారుక్ 2-0-13-0
హైదరాబాద్ జోరుకు బ్రేక్
Published Thu, Apr 3 2014 11:55 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement