mustak Ali trophy
-
ఏడేళ్ల తర్వాత తొలి వికెట్.. ఏడ్చేసిన శ్రీశాంత్
టీమిండియాలో కోపానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుచ్చే పేరు కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్. 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ మొదటి నుంచే అగ్రెసివ్ క్రికెటర్‌గా పేరు పొందాడు. తన కెరీర్ మొత్తంలో ఎక్కువశాతం గొడవలతోనే ఫేమస్ అయ్యాడు. తాను వేసే బంతుల కన్నా చూపులతోనే ప్రత్యర్థి బ్యాట్స్మన్లను భయపెట్టడానికి ప్రయత్నించేవాడు. తాజాగా ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ తొలి మ్యాచ్‌లోనే వికెట్ పడగొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తం 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్ స్వయంగా ట్విటర్లో పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత సొంత జట్టు తరపున వికెట్ తీయడం ఆనందంగా ఉంది. నా జీవితంలో చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఇన్నాళ్ల తర్వాత కూడా అభిమానులు నాపై చూపించిని ప్రేమ, మద్దతుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్ తన సహచర క్రికెటర్లైన అంకిత్ చవాన్, అజిత్ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది. అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. దీంతో కేరళ తరపున ముస్తాక్ అలీ ట్రోపీలో ఆడేందుకు శ్రీశాంత్‌కు లైన్ క్లియర్ అయింది. కొన్ని వారాల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కోపంగా చూడడం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడేళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. Thanks a lot for all the support and love ..it’s just the beginning..with all of ur wishes and prayers many many many more to go..❤️🇮🇳🏏lots of respect to u nd family .. #blessed #humbled #cricket #bcci #kerala #love #team #family #india #nevergiveup pic.twitter.com/bMnXbYOrHm — Sreesanth (@sreesanth36) January 11, 2021 -
ఇటు శ్రీశాంత్... అటు యువీ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువ య్యాడు. ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ కోసం కేరళ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌కు చోటు దక్కింది. ఇటీవలే నిషేధం ముగియడంతో 38 ఏళ్ల శ్రీశాంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2013 ఐపీఎల్లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇదే టోర్నీ కోసం పంజాబ్ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కూడా ఎంపిక చేశారు. గత ఏడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. యువీ అధికారికంగా ‘రిటైర్’ అయ్యాడు కాబట్టి కెనడా గ్లోబల్ టి20 లీగ్, అబుదాబి టి10 టోర్నీలో కూడా ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు యువీ మళ్లీ ఆడాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. మరోవైపు బెంగాల్ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో అవకాశం దక్కించుకున్న ఆల్‌రౌండర్ మొహమ్మద్ కైఫ్... భారత పేసర్ షమీ తమ్ముడు కావడం విశేషం. క్వాలిఫయర్‌తో భారత్ తొలి పోరు దుబాయ్ : న్యూజిలాండ్ వేదికగా 2022 ఫిబ్రవరి–మార్చిలో జరిగే మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి పోరును మార్చి 6న క్వాలిఫయర్‌తో ఆడనుంది. ఆ తర్వాత భారత్ వరుసగా న్యూజిలాండ్ (మార్చి 10న), క్వాలిఫయర్ (మార్చి 12న), ఇంగ్లండ్ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), క్వాలిఫయర్ (మార్చి 22న), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది. -
హైదరాబాద్ జోరుకు బ్రేక్
తమిళనాడు చేతిలో ఓటమి ముస్తాక్ అలీ ట్రోఫీ సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ(సౌత్‌జోన్)లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్‌కు తమిళనాడు కళ్లెం వేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 30 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యం కానప్పటికీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. రాణించిన బాబా బ్రదర్స్... ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్, తమిళనాడుకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు బాబా అపరాజిత్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) శుభారంభం ఇచ్చినా... అరుణ్ కార్తీక్ (12), దినేశ్ కార్తీక్ (0) హైదరాబాద్ బౌలర్ల ధాటికి విఫలమయ్యారు. తర్వాత వచ్చిన వారిలో బాబా ఇంద్రజిత్ (31 బంతుల్లో 37; 2 సిక్సర్లు), విజయ్ శంకర్ (17 బంతుల్లో 24, 2 ఫోర్లు) రాణించడంతో తమిళనాడు చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లు ఆశిష్ రెడ్డి (2/13), ఓజా (2/23), రవికిరణ్ (2/26) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. రాజన్ మినహా... అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భంగపడింది. పటిష్టమైన జట్టు కర్ణాటకపై మెరుపులు మెరిపించిన అక్షత్ రెడ్డి (15 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడగా, విహారి (6), రవితేజ (2) విఫలమయ్యారు. తమిళనాడు చక్కటి బౌలింగ్‌కు హైదరాబాద్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చివర్లో సందీప్ రాజన్ (27 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదు. తమిళనాడు బౌలర్లలో మూర్తి ప్రభు 3, రాహిల్ షా, విజయ్ శంకర్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు తమిళనాడు ఇన్నింగ్స్: అపరాజిత్ (సి) సందీప్ (బి) ఓజా 28; అరుణ్ కార్తీక్ (సి) రవితేజ (బి) ఆశిష్ 12; దినేశ్ కార్తీక్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 0; ఇంద్రజిత్ (సి) రాహుల్ (బి) భండారి 37; ఐన్‌స్టీన్ (సి) భండారి (బి) ఓజా 19; శంకర్ (సి) రాహుల్ (బి) రవికిరణ్ 24; షారుక్ ఖాన్ (సి అండ్ బి) విహారి 3; మహేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవికిరణ్ 3; ప్రభు నాటౌట్ 7; రాహిల్ షా రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-35, 2-35, 3-53, 4-94, 5-102, 6-117, 7-123, 8-135, 9-139 బౌలింగ్: కనిష్క్ 3-0-20-0, రవికిరణ్ 4-0-26-2, ఆశిష్ 3-0-13-2, విహారి 3-0-31-1, ఓజా 4-0-23-2, భండారి 3-0-21-1 హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్ (సి) దినేశ్ కార్తీక్ (బి) సునీల్ 22; రవితేజ (బి) రాహిల్ 2; విహారి (సి) రాహిల్ (బి) ప్రభు 6; రాహుల్ (సి) మహేశ్ (బి) ప్రభు 15; సందీప్ (బి) రాహిల్ 34; భండారి (సి) ఐన్‌స్టీన్ (బి) శంకర్ 15; ఆశిష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శంకర్ 0; అహ్మద్ (సి) అరుణ్ (బి) ప్రభు 5; ఓజా నాటౌట్ 5; కనిష్క్ రనౌట్ 1; రవికిరణ్ (బి) మహేశ్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1-23, 2-25, 3-45, 4-48, 5-85, 6-85, 7-102, 8-104, 9-105, 10-109 బౌలింగ్: రాహిల్ షా 4-0-22-2, సునీల్ 3-0-24-1, ప్రభు 4-0-24-3, మహేశ్ 3.3-0-12-1, శంకర్ 2-0-12-2, షారుక్ 2-0-13-0