లాంగాన్‌లో బ్యాట్స్‌మన్ ఆడిన భారీ షాట్‌ను ఫీల్డర్ అందుకోలేకపోయాడు.. కానీ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకోని ఔరా అనిపించాడు. భారీ షాట్ ఆడిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ కాగా.. మైమరిపించే ఫీల్డింగ్‌తో అదరగొట్టింది న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్. అభిమానులు కనువిందు చేసిన ఈ దృశ్యం బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్-సిడ్నీ సిక్సర్స్‌ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో జేమ్స్ విన్స్ లాంగాన్‌లో ఆడిన భారీ షాట్ ఆడాడు.