తండ్రి మరణ వార్త తెలిసినా.. మ్యాచ్‌ ఆడిన రషీద్‌ ఖాన్‌ | Rashid Khan To Play Big Bash League Match In Spite Of Father Death | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 31 2018 7:20 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Rashid Khan To Play Big Bash League Match In Spite Of Father Death - Sakshi

అప్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ క్రీడాస్పూర్తిని చాటాడు..

మెల్‌బోర్న్‌ : అప్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ క్రీడాస్పూర్తిని చాటాడు. తండ్రి మరణ వార్త తెలిసి కూడా తన ఆటను కొనసాగించి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం బిగ్‌బిష్‌ లీగ్‌ ఆడుతున్న రషీద్‌.. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టు తరపున సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆదివారమే రషీద్‌ తండ్రి మరణించాడు. ఈ విషాదకర వార్త తెలిసినా కూడా రషీద్‌ బాధను దిగమింగుతూ.. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

ఇక తన తండ్రి చనిపోయిన విషయాన్ని రషిదే‘నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా’ అని ట్వీట్‌ చేయగా.. తండ్రి మరణ వార్త తెలిసి కూడా రషీద్‌ మ్యాచ్‌ ఆడటానికి సిద్దపడ్డాడని అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ పేర్కొంది. ఈ విజయాన్ని రషీద్‌ కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఆటగాడు పీటర్‌ సిడిల్‌ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున భారత అభిమానులకు, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులకు రషీద్‌ దగ్గరైన విషయం తెలిసిందే. రషీద్‌ తండ్రి మరణవార్తపై మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement