
PC: CA
BBL 2021 22: బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్‌బోర్న్ స్టార్స్‌ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ సోకింది. యాంటీజెన్ టెస్టులో భాగంగా అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
ఇక అంతకుముందు స్టార్స్ జట్టు ఆటగాళ్లు ఆడం జంపా, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నారు.
చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా
Ashes 2021- 22: సిడ్నీ టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. రెండేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment