Glenn Maxwell Hits Maiden Century in Big Bash League 2021 - Sakshi
Sakshi News home page

Glenn Maxwell: శివాలెత్తిన మ్యాక్స్‌వెల్‌.. 54 బంతుల్లోనే శతకం

Published Wed, Dec 15 2021 10:10 PM | Last Updated on Thu, Dec 16 2021 10:26 AM

Glenn Maxwell Hits Maiden Century In Big Bash League 2021 - Sakshi

Glenn Maxwell In BBL 2021: బిగ్‌బాష్ లీగ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. ప్రస్తుత లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(57 బంతుల్లో 103)తో శివాలెత్తాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో లీగ్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. హాఫ్‌ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసిన మ్యాక్సీ.. ఆతర్వాత గేర్‌ మార్చి ప్రత్యర్ధి బౌలర్లపై విచక్షాణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా మెల్ బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

అనంతరం 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌.. జోష్‌ ఫిలిప్‌(61 బంతుల్లో 99; 11 ఫోర్లు, సిక్సర్లు) వీరవిహారం చేయడంతో  19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం కొసమెరుపు. ఫిలిప్‌ ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చినప్పటికీ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫిలిప్‌ అద్బుతమైన పోరాటం చేసి జట్టును గెలిపించడంతో మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం మరుగునపడింది.
చదవండి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement