క్రికెట్‌లో కాయిన్‌తో టాస్ వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాయిన్‌తో కాకుండా మరో విధంగానూ టాస్ వేసే పద్దతి ఒకటుందన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో రొటీన్‌కు భిన్నంగా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తో టాస్ వేస్తారు. 2018 సీజన్ నుంచి బీబీఎల్‌లో ఈ నూతన ఒరవడి అమల్లో ఉంది.
Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
బీబీఎల్ 2023లో భాగంగా సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు కూడా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తోనే టాస్ వేశారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ వేసే క్రమంలో ఫలితం ఎటూ తేల్చకుండా బ్యాట్ మధ్యేమార్గం (బ్యాట్ ఫ్లిప్) ఎంచుకుంది. దీంతో నిర్వహకులు టాస్‌ను మరోసారి వేయాల్సి వచ్చింది. బీబీఎల్‌లో బ్యాట్ ఫ్లిప్ కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలా జరిగింది.
ఇదిలా ఉంటే సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా టాస్ మాదిరే ఆసక్తికరంగా సాగుతుంది. గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. బ్రిస్బేన్ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ ఒకింత తడబాటుకు లోనవుతుంది. కెప్టెన్ క్రిస్ గ్రీన్ (30 నాటౌట్) సిడ్నీను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత సిడ్నీ స్కోర్ 125/7గా ఉంది. సిడ్నీ గెలుపుకు 14 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 3 వికెట్లు మిగిలి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment