
ఆఖరి బంతికి విజయానికి 3 పరుగులవసరం.. మూడో పరుగు ప్రయత్నంలో
సిడ్నీ : చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఇరు జట్లను ఊరించే విజయం.. ఇలాంటి మ్యాచ్‌ను చూస్తే ఆ మజానే వేరు. ఇక ఆఖరి బంతికి కూడా ఫలితం తేలకుండా.. మళ్లీ సూపర్ ఓవర్ ఆడిస్తే ఆ మ్యాచ్ అద్భుతం. ప్రతి క్రికెట్ అభిమాని ఇలాంటి మ్యాచ్‌నే కోరుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న సమయంలో ఇలాంటి మ్యాచ్‌లు ఆ సంఖ్యను మరింత పెంచుతున్నాయి. సిడ్నీ సిక్సర్స్- రెనిగేడ్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఈ అత్యద్భుతం చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీసిక్సర్స్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేశారు. అనంతరం 132 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన రెనిగేడ్స్ మహిళలు.. 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా అవే 131 పరుగులు చేశారు.
దీంతో మ్యాచ్ టై అయింది. అయితే చివరి బంతికి రెనిగేడ్స్ విజయానికి మూడు పరుగులు అవసరం ఉండగా.. రెనిగేడ్స్ ఓపెనర్ సోఫీ మోలన్ ఆఫ్‌సైడ్ భారీ షాట్ ఆడింది. బంతి బౌండరీకి సమీపిస్తుండగా.. సిడ్నీ సిక్సర్ ఫీల్డర్ అద్భుతంగా అందుకొని కీపర్‌కు అందజేసింది. బంతిని అందుకున్న కీపర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లకు డైరెక్ట్‌గా కొట్టడంతో సోఫీమోలన్ రనౌట్ అయింది. దీంతో రెనిగేడ్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ ఓ వికెట్ కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. రెండు బంతులు మిగిలి ఉండగానే విజయన్నందుకుంది. ఈ గెలుపుతో సగర్వంగా ఫైనల్లో అడుగెట్టింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీ విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Another #WBBL4 last-ball thriller for today, and we're still processing!
— ICC (@ICC) 19 January 2019
Top effort from all of Burns, Aley and Healy!pic.twitter.com/CqLAgzquix