
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికి ధోనికి అభిమానులు ఎక్కువే. అందుకు ధోని కళ్లలో కనిపించే కూల్‌నెస్, చిరునవ్వే కారణం. ధోని లుక్స్‌కు, నవ్వుకు ఎంతటి వారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఈ జాబితాలో ఎందరో యువతులు, మహిళలు కూడా ఉన్నారు. మరి అలాంటి ధోని తమ కళ్ల ముందు నుంచి పోతుంటే అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఎగబడడం సహజంగా చూస్తుంటాం.
తాజాగా ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు కానీ.. ధోని కూల్ స్మైల్, చిరునవ్వుకు ఒక యువతి ఫ్లాట్ అయిపోయింది. ఒక ప్రమోషన్‌కు సంబంధించిన కార్యక్రమం ముగించుకొని తన కారు దగ్గరికి వస్తున్న సమయంలో ధోని ఆ యువతి కంట పడ్డాడు. అంతే పక్కన పరిసరాలను మరిచిపోయి ధోనిని అలా చూస్తూ ఉన్నచోటనే బొమ్మలా నిలబడిపోయింది. ఆ సమయంలో సదరు యువతి ధోనిని చూస్తూ ఇచ్చిన చిరునవ్వు అందరిని ఆకట్టుకుంది.
ధోనిని కవరేజ్ చేయడానికి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ ఆ యువతి ఫోటోలను కూడా క్లిక్‌మనిపించాడు. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారాయి. ''నీ నవ్వుతో మా మనుసులు దోచేశావు.. ఎవరు పిల్లా నువ్వు''.. అని ఒకరు కామెంట్ చేస్తే.. ''ధోని భయ్యాను చూసి నువ్వు ఫ్లాట్ అయితే.. నీ అందాన్ని చూసి నేను ఫ్లాటయ్యా'' అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment