Fact Check On BRS Leader Circulate PM Modi Lord Ganesh Viral Photo - Sakshi
Sakshi News home page

గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్‌ఎస్‌ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు

Published Wed, Aug 2 2023 7:18 PM | Last Updated on Thu, Aug 17 2023 3:20 PM

Fact Check On BRS Leader Circulate PM Modi Lord Ganesh Viral Photo - Sakshi

దగ్దుషేత్ హల్వాయి గుడితో గణపతికి ప్రధాని మోదీ పూజలు

ఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను వైరల్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేతపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంగళవారం మహారాష్ట్ర పూణే పర్యటన సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించారాయన. ఆ టైంలో ఆయన విఘ్నేషుడి విగ్రహానికి వెన్ను చూపించారంటూ బీఆర్‌ఎస్‌ నేత వై సతీష్‌రెడ్డి తన ట్విటర్‌లో పోస్ట్‌చేసి మండిపడ్డారు. 

మోదీ జీ, మన దేవతలకు వెన్ను చూపడం అగౌరవంగా పరిగణించబడుతుంది. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారు? అంటూ ట్వీట్‌ చేశారాయన. దీనిపై పలువురు రాజకీయనేతలు కూడా స్పందించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. బీజేపీ శ్రేణులు కౌంటర్‌కు దిగాయి. ఫ్యాక్ట్‌ చెక్‌ పేరిట అసలు విషయాన్ని బయటపెట్టాయి. 

మోదీ వినాయకుడి ముందర పరికర్మ చేస్తున్న టైంలో స్క్రీన్‌షాట్‌ తీసి.. దానిని ఇలా వైరల్‌ చేశారు. ఆ విషయాన్నే బీజేపీ నేతలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

పుణే శివాజీ రోడ్‌లో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణేష్ దేవాలయం.. మహారాష్ట్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చే ఆలయాల్లో ఒకటి. నవరాత్రుల సమయంలో  లక్షల మంది దర్శిస్తుంటారు. రాష్ట్రపతులు, ప్రధానులు, మాజీలు తరచూ ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement