Vijay Sethupathi Stuns Fans With His Drastic Weight Loss in Short Time - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi New Look: విజయ్‌ సేతుపతి షాకింగ్‌ లుక్‌ వైరల్‌, అవాక్కవుతున్న ఫ్యాన్స్‌

Published Tue, Dec 13 2022 8:44 PM

Vijay Sethupathi Stuns Fans With His Drastic Weight Loss in Short Time - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి.

చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే స్టార్‌ నటుడిగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్‌ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్‌ సేతుపతి నయా లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి స్లీమ్‌గా హీరోలా కనిపించి ట్రోలర్స్‌కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్‌ చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్‌ పేజీలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement