ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లో కొందరు నటీనటులు పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ తమ త్రోబ్యాక్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ గుర్తు పట్టారా? అంటూ చాలెంజ్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఓ సెలబ్రెటీ రేర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
చదవండి: లైవ్‌లో ఎక్స్‌లవ్, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..
అమాయకపు లుక్స్‌తో రాముడు మంచి బాలుడు అనే విధంగా కనిపిస్తున్నా ఈ కుర్రాడు ఏ హీరో, నటుడు మాత్రం కాదు. కానీ అంతకు మించిన సెలబ్రెటీ. తరచూ వార్తల్లో నిలుస్తాంటాడు. అందరిది ఒక దారి అయితే ఈయన దారి సపరేట్ అంటాడు. తరచూ వివాదాలు, సంచలనాలకు తెరలేపుతుంటాడు. తనకు తానే ‘నన్ను నమ్మోద్దు మంచి వాడిని కాదు’ అంటూ ప్రచారం చేసుకుంటాడు. దీంతో మాకీదేం కర్మరా బాబు అని కొందరూ అనుకుంటుంటే.. మరికొందరు అసలు ఈ వ్యక్తి ఇలా ఎలా ఉంటాడు అనేంతగా ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఇప్పటికే ఈ కుర్రాడు ఎవరో పట్టేసినట్టున్నారు కదా.
చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్
అదే మీరు అనుకుంటున్న సెలబ్రెటే, ఆయనే వర్మ. వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ఫస్ట్ మూవీతోనే బ్లాకబస్టర్ హిట్ అందుకున్నాడు. ఆయన ఆలోచనలు తీరుకు తగ్గట్టుగానే రక్త చరిత్ర, దెయ్యం, సత్యం వంటి ఫ్యాక్షన్, ఫాంటాసి చిత్రాలను తెరకెక్కించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. జయాపజయాలతో సంబంధంగా లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. నిజ జీవిత సంఘటనలను తెరకెక్కిస్తూ కాంట్రవర్సిల చూట్టు తిరుగుతుంటాడు. ఏ అంశం లేకపోతే ట్విటర్‌లో సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ.
Comments
Please login to add a commentAdd a comment