అతడితో చహల్‌ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా? | Chahal Wife Dhanashree Verma Gets Trolled For Picture With Pratik Utekar | Sakshi
Sakshi News home page

#DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్‌ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ

Published Mon, Mar 4 2024 10:46 AM | Last Updated on Mon, Mar 4 2024 11:55 AM

Chahal Wife Dhanashree Verma Gets Trolled For Picture With Pratik Utekar - Sakshi

టీమిండియా క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

‘‘చహల్‌ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?!

టీమిండియా బౌలర్‌గా కెరీర్‌ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్‌. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్‌ ఓ సందర్భంలో తెలిపాడు.

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. 

ఈ క్రమంలో గతేడాది తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్‌ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్‌- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్‌ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్‌కు అప్పట్లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు.

తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్‌కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్‌ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్‌ ప్రతీక్‌ ఉటేకర్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది.

ప్రతీక్‌ స్వయంగా ఈ పిక్చర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్‌)గా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఝలక్‌ దిఖ్లా జా షోలో ఫైనల్స్‌ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్‌లో ఫైనల్‌ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్‌ కంటెస్టెంట్‌ ట్రోఫీని అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement