సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Big Day In Telangana Today… ❤️
— Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023
Opening of New Telangana’s Secretariat 👏
Not Graphics like in other states 😀
It’s A Reality… The Best in India…
Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు
Comments
Please login to add a commentAdd a comment