Laser show
-
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
అత్యుత్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటి
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): దేశంలోనే అత్యు త్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కులో కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్‌లో భాగంగా రూ.50 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్‌షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. ప్రస్తుత మున్న కోహినూర్ వజ్రపు కథ స్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకో వాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదా యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోహినూర్ కథను రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా, సింగర్ సునీత గాత్రం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక్కడే నిర్మించిన మల్టీ పర్పస్ బాంక్వెట్ హాల్‌ను మంత్రులు ప్రారంభించారు. -
అనంత్-రాధిక పెళ్లి సందడి : జోరుగా సన్నాహాలు, లేజర్ లైట్ షో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీచిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి సందడికి సంబంధించి రోజుకో ముచ్చట వార్లల్లోనిలుస్తోంది. తాజాగా గుజరాత్‌లోని జామ్ నగర్లో నిర్వహించిన లేజర్ లైట్ షో ఆకర్షణీయంగా నిలుస్తోంది. అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌తో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్,బిజినెస్ వర్గాల్లో ఎదురు చూస్తున్నాయి. ఈ జంట జూలై 12న మూడుముళ్ల వేడకను నిర్వహించేందుకు ఇరుకుటుంబాలుఏర్పాటు ముమ్మరం చేశాయి. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌కు ముందు మార్చి 1- ఏప్రిల్ 2024 ప్రీ వెడ్డింగ్ వేడులకు సన్నాహాలు ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) శ్రీకృష్ణుడి థీమ్‌తో లేజర్ లైట్షో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముందు అంబానీకుటుంబం లేజర్ లైట్ షోను ఏర్పాటు చేసిందట. శ్రీకృష్ణుడి థీమ్‌తో జామ్‌నగర్‌లో అందమైన లేజర్ లైట్ షోని విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తల్లీ కొడుకుల మధ్య అందమైన బంధాన్ని, పచ్చదనంలో తిరుగుతున్న ఏనుగును, నీలి ఆకుపచ్చ రంగులలో జామ్‌నగర్ మ్యాప్‌ను చూపించే దృశ్యాలు విశేషంగా నిలుస్తున్నాయి. అంతేకాదు వివాహానికి ముందు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 కొత్త ఆలయాలను ప్రారంభించనున్నారు. అతిరథమహాథులు, డ్రెస్‌కోడ్, గిఫ్ట్‌లు అలాగే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముఖేష్ అంబానీ ప్రముఖ అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారట. ఖతార్ ప్రధాన మంత్రి, భూటాన్ రాజు ,రాణి సాహా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్, స్టీఫెన్ స్క్వార్జ్మాన్, డిస్నీ CEO, బాబ్ ఇగర్,అడోబ్ సీఈఓ, శంతను నారాయణ్ లాంటి ప్రముఖులున్నారు. అలాగే అతిథులకు కూడా మూడు రోజులపాటు విభిన్న దుస్తుల కోడ్ ఉంటుంది. దీంతోపాటు అతిథులకు బ్రహ్మాండమైన బహుమతులను కూడా ఇవ్వబోతున్నారట. -
మోదీ హయాంలోనే పర్యాటక అభివృద్ధి
హైదరాబాద్(గోల్కొండ): ప్రధాని మోదీ హయాంలోనే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింద ని ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవా రం గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షోను సినీనటుడు చిరంజీవితో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలోనే అన్ని రాష్ట్రాలలో టూరిజంకు ఆదరణ పెరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గోల్కొండ కోటలో ప్రస్తుతమున్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేశామన్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రతి రోజూ మూడు భాషల్లో ఉంటుందని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేస్తామన్నారు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రూ.1300 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్షో వచ్చే నెలలో ప్రారంభమవుతుందని, దీనికి వాడుతున్న లేజర్ లైట్లు దేశంలోనే అత్యుత్తమమైనవని తెలిపారు. వరంగల్ కోటలో కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తామని, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గిరిజన పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ తాను కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటలో 50 దేశాల ప్రతినిధులతో సమావేశమైన వారికి లైట్ అండ్ షో చూపించామన్నారు. మగధీరతో పాటు రామ్‌చరణ్‌తో కలిసి గోల్కొండ కోటలో తాను సినిమా షూటింగ్లో పాల్గొన్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ యూఎస్.రావత్ పాల్గొన్నారు. -
Dr. BR Ambedkar Statue Drone Show: అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. అబ్బురపరిచిన డ్రోన్ షో (ఫొటోలు)
-
Drone Show: మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న మెగా లేజర్ షో (ఫోటోలు)
-
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
కొత్త సచివాలయం ప్రారంభ సంబరాలు (ఫొటోలు)
-
Video: బాణసంచా వెలుగుల్లో కొత్త సచివాలయం.. అదరహో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Big Day In Telangana Today… ❤️ Opening of New Telangana’s Secretariat 👏 Not Graphics like in other states 😀 It’s A Reality… The Best in India… Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon — Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు -
లేజర్ షో... కార్పొరేట్ దిగ్గజాలు ఫిదా
-
అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్‌లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్ కమిషనర్ నవ్‌దీప్ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు. లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్‌లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన -
కేఎంసీ మైదానంలో ‘అవేక్ వరంగల్’ (ఫొటోలు)
-
ట్యాంక్ బండ్‌పై సండే - ఫండే కార్యక్రమం... ఆకట్టుకున్న లేజర్ షో
-
నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. డాక్యుమెంటరీ
-
వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా!
సాక్షి, హైదరాబాద్: ‘మా బంగారు బతుకమ్మ.. పో యిరావమ్మా’, ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’, అని పాడుతూ.. బుధవారం సాయంత్రం సద్దుల బతుకమ్మకు తెలంగాణ ఆడపడుచులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ పైనున్న బతుకమ్మ ఘాట్, లలితకళా తోరణం, రవీంద్రభారతిలతోపాటు నగరంలోని వివిధ చెరువు గట్ల వద్ద బుధవారం బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఆ«ధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆడపచుడుల ఆటపాటలు, టపాసుల వెలుగుల మధ్య బతుకమ్మ నిమజ్జన సంబరం అంబరాన్నంటింది. దీనికితోడు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం నుంచి కుండపోత వర్షం కారణంగా ప్రారంభంలో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్ప.. ఇతర ప్రాంతాలవారు పెద్దగా కనిపించలేదు. కానీ..వర్షం తెరిపిచ్చిన తర్వాత (రాత్రి 7.45 అనంతరం) ఒక్కొక్కరుగా వేలాది మంది బతుకమ్మ ఘాట్ చేరుకున్నారు. ట్యాంక్‌బండ్ పండుగశోభ సంతరించుకుంది. బ్రహ్మకుమారీలు కుల్దీప్ సిస్టర్స్, సంతోష్ దీదీ సిస్టర్స్ బతుకమ్మలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శోభాయమానంగా సాంస్కృతిక యాత్ర బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడపడుచులు, 850 మంది కళాకారుల ప్రదర్శనలు, వారిని చూసేందుకు వచ్చిన ఆశేష జనంతో ట్యాంక్‌బండ్ కిటకిటలాడింది. అంబేద్కర్ విగ్రహం వద్ద సాంస్కృతిక యాత్ర (కల్చరల్ కార్నివాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలు జెండా ఊపి ప్రారంభించారు. చిందు, యక్షగాన, బైండ్ల, ఒగ్గు, డప్పులు, కొమ్ము కొయ్య, లంబాడీ, గుస్సాడీ, చిరుతల భజన, డోళ్లు మ్రోగిస్తూ కళాకారులు బతుకమ్మలతో కలిసి ముందుకుసాగారు. మహారాష్ట్ర కళాకారులు నిర్వహించిన ‘డోల్ తాషా’నృత్యం యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగే పండుగల్లో బతుకమ్మ పండుగ తెలంగాణకు ఓ బ్రాండ్‌గా మారిందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ ఇదేనన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాలన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా వెలుగుల మధ్య అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు లేజర్ షోతో బతుకమ్మ కథ మారియట్ హోటల్ సమీపంలో హుస్సేన్‌సాగర్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకొంది. బతుకమ్మ కథను లేజర్ షో ద్వారా ప్రజలకు వివరించారు. పబ్బుల్లో లాగా డ్యాన్స్‌ఫ్లోర్ ఏర్పాటు చేసి బతుకమ్మ బొమ్మలు, కథలు వివరించారు. 75 మంది మహిళా విదేశీ కళాకారులు బతుకమ్మ చేపట్టి బతుకమ్మ ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను చూసేందుకు జనం ఎగబడటంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులకు తిప్పలు తప్పలేదు. హుస్సేన్ సాగర్ నీటిలో ఫాటింగ్ బతుకమ్మలను పది చిన్న పడవ (పుట్టి)ల్లో ఉంచారు. అయితే.. వర్షం కారణంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించిన పారామోటరింగ్, బెలూన్ కార్యక్రమాలు వాయిదా వేశారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలు గురువారానికి వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షం కారణంగా ‘ఆకాశంలో బతుకమ్మ’కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు అధికారులు చెప్పారు. -
సాగర అలల్లో.. పూల పడవల్లో..
-
లేజర్ షోకులేనా?
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కులోని లేజర్ షో మసకబారుతోంది. మొత్తం ఐదెకరాల్లో పార్కు, లేజర్ షో ప్రాంతం, పార్కింగ్ ప్రదేశం ఉన్నాయి. అయితే ఇందులోని ఎకరం స్థలాన్ని ఇటీవల ఆర్అండ్బీ శాఖ తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి తీసుకుని పనులు చేపట్టింది. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి తలెత్తింది. దీనివల్ల లేజర్షోకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. బస్సులు, కార్ల పార్కింగ్‌కు చోటులేక దేశ, విదేశీ అతిథులు తమ సందర్శన జాబితాలో లుంబినీపార్కు, లేజర్ షో లేకుండానే పర్యటనను ముగించుకుంటున్నారు. ప్రస్తుతం కార్లు, బస్సులు నిలిపే స్థలాన్ని ఆర్ అండ్‌బీ స్వాధీనం చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా తీసుకోనున్నారు. అదే జరిగితే.. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోవచ్చని పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. తగ్గిపోయిన సందర్శకులు వీకెండ్లో సందర్శులు కుటుంబ సభ్యులతో ఎంచక్కా వాహనాల్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసేవారు. తర్వాత లుంబినీపార్కు చుట్టేయడంతో పాటు సాగర్ తీరాన బోటులో షికారు చేసి సాయంత్రం లేజర్ షో చూసి తిరిగి వెళ్లేవారు. ఆగస్టు తొలి రెండు వారాల్లో లుంబినీ పార్కుకు సందర్శకుల సంఖ్య రోజుకు సగటున 5 వేలు ఉంటే.. చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 3,750 వరకు తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పూర్తిగా పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని, పార్కింగ్‌కు స్థలం ఇవ్వకపోతే లుంబినీపార్కు, లేజర్ షో విశిష్టత మసకబారడం ఖాయమని అధికారులు అంటున్నారు. లేజర్ షోకు ‘నష్ట’కాలమే.. లుంబినీ పార్కుకు వచ్చే పర్యాటకుల్లో సీజన్ సమయాల్లో లేజర్ షోకు 1500 నుంచి 1800 మంది వరకు వీక్షకులు ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం (ఆన్‌సీజన్)లో ఆ సంఖ్య వెయ్యి మందికి పడిపోయింది. ఆగస్టు తొలి రెండు వారాల్లో 800కు పైగానే వీక్షించినా చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 400కు తగ్గిపోయింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం కూడా పోతే లుంబినీ పార్కు, లేజర్ షో ఆదాయంపై ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. లుంబినీ పార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా వసూలు చేస్తున్న అధికారులు లేజర్ షోకు రూ.50 తీసుకుంటున్నారు. పార్కుకు రాకుండా నేరుగా లేజర్షోకు వెళ్లేవారికి భద్రతా సిబ్బంది రూ.50 ఛార్జి తీసుకుంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే అటు పార్కుకు వచ్చే ఆదాయం, ఇటు లేజర్ షోకు వచ్చే ఆదాయం కేవలం వాహనాలకు పార్కింగ్ లేకపోవడం వల్ల దాదాపు 25 శాతం పడిపోయిందని చెబుతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యామ్నాయం చూపెడితే తప్ప ఆదాయం పెరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు. పార్కింగ్‌పై తర్జనభర్జన.. లుంబినీ పార్కులో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్ట్ బాధ్యతలు చూసుకుంటున్న సంస్థను తప్పుకోవాలని ఇప్పటికే హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌కు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ పరిమిత కాలాన్ని బట్టి సమకూర్చాలని ఆలోనచలో అధికారులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్న ఆర్అండ్బీ అధికారులు తొలిరెండు అంతస్తుల్లో లుంబినీపార్కు, లేజర్ షోకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు చోటిస్తామని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆలోపు వాహనాల పార్కింగ్ సమస్య ఏంటనేదాని పైనే అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చొరవ చూపి ఏదో ఒక మార్గాన్ని చూపాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు. -
లేజర్‘షాక్’..
‘లేజేరియం’ టెండర్‌కు చుక్కెదురు ! ఒక్క బిడ్ కూడా దాఖలు కాని వైనం ఖంగుతిన్న హెచ్ఎండీఏ అధికారులు సాధ్యంగాని నిబంధనలే కారణం సిటీబ్యూరో: గ్రేటర్ వాసులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ‘లేజర్ షో’కు హంగులద్దేందుకు మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేసిన యత్నం బెడిసి కొట్టింది. ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నానికి కూడా చుక్కెదురవడం ఇంజినీరింగ్ అధికారులకు మింగుడుపడకుండా ఉంది. లుంబినీ పార్కు ఆవరణలోని లేజర్ షోను ‘న్యూ థీమ్స్’తో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించిన హెచ్ఎండీఏ.. ఇటీవల గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. గడువు ముగియడంతో సోమవారం ఆ టెండర్స్ ఓపెన్ చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పిలిచిన టెండర్‌కు కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలవ్వక పోవడం గమనార్హం. నగర సంస్కృతి, చరిత్ర తదితర అంశాలతో పాటు ఎడ్యుకేషన్ (అవగాహన), ఇన్ఫర్మేషన్ (సమాచారం) రిక్రియేషన్ (వినోదం) వంటి అంశాలను నేపథ్యంగా కొత్త థీమ్స్‌ను ప్లాన్ చేసిన అధికారులు రూ. 2.5 కోట్ల అంచనాలతో టెండర్లు ఆహ్వానించారు. అయితే, టెండర్లో ఆచరణ సాధ్యంకాని విధంగా నిబంధనలు పెట్టడంతో అసలుకే మోసం వచ్చిపడింది. కఠిన నిబంధనల వల్లే.. లేజర్ షోను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా పెద్దగా స్పందన రాలేదు. మొదట్లో రెండు సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపినా లేజర్ షోకు సంబంధించిన డిజైన్‌ను వారే రూపొందించుకోవాలన్న నిబంధనతో వెనుదిరిగారు. రెండోసారి ప్రదర్శన తాలూకు డిజైన్‌ను హెచ్ఎండీఏనే ఇస్తుందని స్పష్టం చేస్తూ మళ్లీ టెండర్ పిలిచారు. దీనికి సింగిల్ బిడ్ దాఖలు కావడంతో నిబంధనల ప్రకారం ఒక బిడ్ వస్తే ఆ టెండర్‌ను ఇవ్వడం సాధ్యం కాదని రద్దు చేశారు. ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచినా కొన్ని కఠిన నిబంధనలు పెట్టడంతో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గతానుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఆచరణ సాధ్యం గాని నియమ, నిబంధనలు టెండర్లో పొందుపరచడం ఆ ప్రాజెక్టు పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల పాటు లేజర్ షో నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని, ఆ సంస్థ టర్నోవర్ రూ. 1 కోటి ఉండాలని, ఈ తరహా ప్రాజెక్టును గతంలో చేపట్టిన అనుభవం ఉండాలని, అందుకు నిదర్శనంగా తగిన సర్టిఫికెట్ జత చేయాలని, జాయింట్ వెంచర్‌కు అవకాశం లేదని.. ఇలా సవాలక్ష నిబంధనలు పెట్టారు. వంద కోట్ల ప్రాజెక్టుకు కూడా లేనివిధంగా రూ. 2.5 కోట్ల ప్రాజెక్టుకు నిబంధనలు విధంచడంతో దీనికోసం ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రీ బిడ్ మీటింగ్‌కు రెండు సంస్థలు హాజరైనా హెచ్ఎండీఏ విధించిన నిబంధనలు చూసి పత్తాలేకుండా పోయారు. ఈ విషయమై సంబంధిత అధికారిని సంప్రదించగా లేజర్ షోకు ఒక్క బిడ్ కూడా రాని విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలో కన్సల్టెంట్‌తో మాట్లాడి నిబంధనలను సడలిస్తూ మళ్లీ టెండర్ పిలుస్తామని సెలవిచ్చారు. -
ఉప్పొంగిన ఉత్సవ్
వైభవంగా విశాఖ ఉత్సవ్ ఆరంభం నాలుగు ప్రాంతాల్లో సంబరాలు కళా ప్రదర్శనలతో కళకళలాడిన ఆర్కె బీచ్ పరిసరాలు వుడాపార్క్‌లో ఫల, పుష్ప ప్రదర్శన కైలాసగిరిలో లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణ విశాఖపట్నం: కడలి కెరటాలతో పోటీపడుతూ ‘విశాఖ ఉత్సవ్’ ఉప్పొంగింది. సంస్కృతి, సంప్రదాయాల కలయికలో సంబరాలు తీసుకువచ్చింది. సంప్రదాయ నృత్యాలు, పౌరాణిక ఘట్టాలు, అభివృద్ధి, సంక్షేమ శకటాలు, యుద్ధ విన్యానాలు, వీనుల విందైన ప్రదర్శనలతో నగరమంతా పండుగ నింపింది. హుద్ హుద్ తుపాను చేసిన గాయాలను మరిపించేలా, ఉజ్వ ల భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించేలా విశాఖ ఉత్సవం శుక్రవారం ప్రారంభమైం ది. మూడు రోజుల పాటు ఈ సంబరాలు విశాఖ వా సులను ఆనందడోలికల్లో ముంచెత్తనున్నాయి. కైలాసగిరి, వుడాపార్క్, గురజాడ కళాక్షేత్రం, శిల్పారామంలో ఉత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా బీచ్ రోడ్డులో భారీ కార్నివాల్ జరిగింది. పౌరాణిక వేషధారణలతో కళాకారులు ఈ కార్నివాల్లో పాల్గొన్నారు. కోలాటం భజనలు, శాస్త్రీయ నృత్యాలు, తప్పెటగూళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, థింసా, లంబాడీ గిరిజన నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, లు, నీటి యాజమాన్య సంస్థ, నేవీ, అన్నవరం సత్యదేవుడు రధం, సింహాచలం నర్శింహస్వామి రథం, హరేకృష్ణ మూమెంట్, విశాఖ మెట్రో నమూనా సెకటాలు ప్రదర్శించారు. కార్నివాల్లో వివిధ విద్యాసంస్థల విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు, జిల్లా అధికారులు కార్నివాల్లో పాదయాత్ర చేశారు. విద్యార్ధులు మైమ్ వంటి కళారూపాలు ప్రదర్శించారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ దేవాలయాల నమూనాలు తీరంలో నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ నివారణ మందులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నావికాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అణు జలాం తార్గామి అరిహంత్ సముద్రంలో చక్కర్లు కొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ పరికరాలను నేవీ ప్రదర్శించింది. కైలాసగిరి మీద నిర్వహించిన లేజర్ షో అబ్బురపరిచింది. వుడాపార్క్‌లో ఫల, పూల ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన లక్షలాది రకాల పూలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వైఎంసిఎ వద్ద గోకార్టింగ్,జోర్బింగ్(వాటర్ గేమ్), బుల్ గేమ్‌లలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సగం ధరకే గోకార్టింగ్‌ను నిర్వాహకులు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను వివరిస్తూ, తెలుగు వారి పిండి వంటలను రుచి చూపించే దాదాపు 150 స్టాల్స్‌ను బీచ్‌లో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో కొనుగోలుకు ఉంచారు. చిన్నారులు పతంగులు ఎగురవేశారు. తొలి రోజు వేడుకల్లో ఎంపీలు కె.హరిబాబు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్, మంత్రులు గంటా శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్, గణబాబు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా విసీ టి. బాబూరావునాయుడు, జివిఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై కైలాసగిరి శివపార్వతుల సెట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదిక నుంచే వెంకయ్యనాయుడు ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణ కాగా పద్మశ్రీ శివమణి వాయించిన డ్రమ్స్ కుర్రకారును చిందులేయించాయి. -
సివిక్ సెంటర్లో లేజర్ షో
న్యూఢిల్లీ: నగరం నడిబొడ్డున ఉన్న పురపాలక సంస్థల పరిపాలనా కేంద్రం సివిక్ సెంటర్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల రంగులతో లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తన ప్రధాన కార్యాలయంలో లేజర్ షోకు ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ రోజున వీధి ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొదటిసారిగా తాము లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నామని ఎన్డీఎంసీ పౌర సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ చెప్పారు. ఆ రోజు సాయంత్రం తమ ప్రధాన కార్యాలయం రంగుల హరివిల్లుగా మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సూత్రప్రాయంగా అనుమతి లభించిందని చెప్పారు. చీకటి పడిన వెంటనే దాదాపు నాలుగు గంటల పాటు ఈ షో కొనసాగుతుందన్నారు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో 12, 13 తేదీల్లో మేళా నిర్వహిస్తామని, ఇటీవల జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన వీధి ప్రదర్శన ‘రహగిరి’ని సాయంత్రం 4.00 నుంచి 7.00 గంటల మధ్య ప్రదర్శిస్తామని మాన్ చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు వాహనాలు కనిపించకపోవడం ప్రజలకు ఆసక్తిగా మారగలదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) కూడా 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్డీఎంసీ ఇంటింటి పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు పౌర స్పృహను ప్రదర్శించాలని కోరే లక్ష కరపత్రాలను ముద్రించామని వాటిని స్కూలు పిల్లలు పంచి పెడతారని ఎస్డీఎంసీ పీఆర్ఓ ముఖేశ్ యాదవ్ చెప్పారు. -
సరికొత్త ‘షో’కులతో...
ఆధునిక పరిజ్ఞానంతో లేజర్ షో నగర చరిత్ర, సంస్కృతులకు పెద్దపీట రూ.3.5 కోట్లతో ఆధునిక హంగులు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ప్రాంత చరిత్ర, సంస్కృతులను కళ్ల ముందుంచుతూ పర్యాటకుల మదిని దోచుకుంటున్న ‘లేజర్ షో’కు సరికొత్త అందాలు అద్దేందుకు హెచ్ఎండీఏ నడుం బిగించింది. లుంబినీ పార్కులో ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శిస్తున్న లేజర్ షో భాగ్యనగరానికేగాక మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కూడా కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. దీన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న థీమ్‌కు కొత్తగా మరో 2 థీమ్స్‌ను జత చేసేందుకు రూ.3.5 కోట్ల అంచనాలతో సోమవారం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. టర్న్‌కీ ప్రాతిపదికన అయిదేళ్ల పాటు నిర్వహణ, మరమ్మతులతో పాటు మల్టీమీడియా లేజర్ షో రూపకల్పన, సరఫరా, స్థాపన, ప్రదర్శన చేపట్టాలన్న నియమ, నిబంధనలను గ్లోబల్ టెండర్లో ప్రతిపాదించినట్లు చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అధునాతనమైన వివిధ థీమ్‌లను అధ్యయనం చేశాక వాటి నమూనాల ఆధారంగానే లుంబినీ లేజర్ షో థీమ్ పార్కుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలో అద్భుత లేజర్ టెక్నాలజీని పర్యాటకులకు పరిచయం చేస్తామని చెప్పారు. వైభవానికి చిహ్నంగా... ప్రధానంగా తెలుగు సంస్కృతి, వైభవం, హైదరాబాద్ ప్రాంతంలోని చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా రెండు సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు నగర ప్రజానీకాన్ని సంతృప్తిపరిచే విధంగా కొత్త థీమ్‌లను రూపకల్పన చేయాలన్నది అధికారుల యోచన. చిన్నపిల్లలు, విద్యార్థులకు వినోదం, విజ్ఞానం పంచి ఇచ్చే కొత్త థీమ్‌లపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ ప్రాంత చరిత్ర, వారసత్వం, సంస్కృతిపై ఓ అవగాహన కల్పించేలా సరికొత్త థీమ్‌లను షోలో చేర్చాలని భావిస్తున్నారు. పర్యావరణం, పరిసరాల విజ్ఞానం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కొన్ని థీమ్‌లను చేర్చాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కొత్త లేజర్ షో అందుబాటులోకి వచ్చే వరకు పర్యావరణ పరిరక్షణపై కొన్ని యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించాలని యోచిస్తున్నారు. మార్పులకు అనుగుణంగా... లుంబినీ పార్కులో ప్రస్తుతం ప్రదర్శిస్తున్న లేజర్ షోలు ప్రధానంగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ వి.కృష్ణ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇది కొత్తగానే ఉంటుందనే భావనతో ఎనిమిదేళ్లుగా ఒకే థీమ్‌ను కొనసాగిస్తూ వచ్చామన్నారు. ఇప్పుడు సాంకేతికంగా, వైజ్ఞానికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా లేజర్ షోలకు కొత్త హంగులు సమకూర్చాలని కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రధానంగా లేజర్స్, పౌంటెన్స్, ఫౌంటెన్లస్రీన్స్ వంటి వాటిని అంతర్జాతీయ స్థాయిలోతీర్చిదిద్దుతామన్నారు. సాగర్ తీరంలోకి అడుగిడే పర్యాటకుల కోసం సరికొత్త అందాలను ఆవిష్కరించాలన్నదే హెచ్ఎండీఏ యోచన అని ఓఎస్డీ చెప్పారు. -
రోజూ ఒకటే ‘ఆట’
క్రేజీ పోయి... లేజీ ఆవహించింది. వెలుగు జిలుగులు లయ తప్పి ఆస్వాదనం ఆవిరి అవుతోంది. పాడిందే పాట... అన్నట్టుగా ఏడేళ్లుగా ఒకటే పాట... ఒకటే ఆట... ఒకటే బోరు. కోట్లాది రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప... వచ్చినవారిని ఆకట్టుకోలేకపోతోంది లుంబినీ పార్కులోని లేజర్ షో. పర్యాటకుల ఉత్సాహాన్నంతా ఒకే దెబ్బకు ఎగరేసుకుపోతోంది. రోజూ ఒకటే ‘ఆట’ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పర్యవేక్షణలో ప్రస్తుతం లుంబినీ పార్కు నిర్వహణ సాగుతోంది. ఆదాయంపై దృష్టి సారించడం మినహా అదనపు హంగులు సమకూర్చేందుకు హెచ్ఎండీఏ ఎలాంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. వినోదం కోసం వచ్చేవారికి వైవిధ్యం లేక విసిగెత్తిపోతున్నా... చార్జీల మోత మాత్రం మోగిస్తూనే ఉంది. ఆరంభంలో రూ.30 ప్రవేశ రుసుముతో ప్రారంభమైన లేజర్ షోకు... ప్రస్తుతం రూ.50 వసూలు చేస్తున్నారు. అయితే అందుకు తగ్గ వినోదాన్ని మాత్రం పర్యాటకులకు అందించలేకపోతున్నారు. మూస ధోరణితో ప్రదర్శిస్తున్న షోతో ప్రేక్షకులు బోరెత్తిపోతున్నారు. లేజర్ షో వల్ల ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా... విభిన్నంగా, కొత్తగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్న ధ్యాస కూడా హెచ్ఎండీఏకు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. టెండర్ ఎందుకు రద్దైంది? పర్యాటకులను ఆకట్టుకొనే లేజర్ షోకు కొత్త అందాలు అద్దేందుకు అధికారులు చేసిన ప్రయత్నానికి స్వయంగా హెచ్ఎండీఏ కమిషనర్ మోకాలడ్డటం విస్మయం కల్గిస్తోంది. జీవవైవిధ్య సదస్సు (కాప్-11) సందర్భంగా లేజర్ షోకు మరిన్ని హంగులద్దేందుకు రూ.1.65 కోట్లు నిధులు కేటాయించారు. ప్రస్తుతమున్న థీమ్‌కు కొత్త థీమ్‌ను జత చే సేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి, వైభవాలు, హైదరాబాద్ చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని భావించారు. ఆమేరకు టెండర్‌ను కూడా ఆహ్వానించగా... రెండు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే.. సాంకేతికంగా మంచి ఎక్విప్మెంట్ను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకు వస్తే ... వారికి ఈ టెండర్‌ను అప్పగించాలని కమిషనర్ అంతర్గతంగా సిబ్బందికి సూచించారు. దీంతో వ్యవహారం టెక్నికల్ బిడ్స్ వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత దీనిగురించి పట్టించుకొన్న నాథుడే లేడు. ప్రస్తుతం పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. ఈ దశలో మళ్లీ టెండర్ పిలిచేందుకు ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపుతూ అధికారులు లేజర్ షో నవీకరణనను గాలికి వదిలేశారు.