లైట్ అండ్ సౌండ్ లేజర్‌షోను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): దేశంలోనే అత్యు త్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కులో కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్‌లో భాగంగా రూ.50 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్‌షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. ప్రస్తుత మున్న కోహినూర్ వజ్రపు కథ స్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకో వాలని కోరారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదా యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోహినూర్ కథను రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా, సింగర్ సునీత గాత్రం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక్కడే నిర్మించిన మల్టీ పర్పస్ బాంక్వెట్ హాల్‌ను మంత్రులు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment