Prabhas Adipurush Movie Lord Ram Fan Made First Look Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: వైరల్‌గా ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ న్యూ లుక్‌! శ్రీరాముడిగా ‘డార్లింగ్‌’ను చూశారా?

Published Mon, Jan 31 2022 6:30 PM | Last Updated on Mon, Jan 31 2022 8:07 PM

Is This Prabhas Look From Adipurush Movie Goes Viral - Sakshi

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్‌ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ మైథలాజికల్‌ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తి చేశాడు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్‌ పునులతో మూవీ టీం బిజీగా ఉంది.

చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్‌ సునీత కుమారుడు!

ఈ పాన్‌ ఇండియా మూవీలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్‌లోని ప్రభాస్‌ శ్రీరాముడి లుక్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిగా ప్రభాస్‌ ఎలా లైవ్‌ లుక్‌ ఎలా ఉండనుందోనని డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తికి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆది పురుష్‌లో ప్రభాస్‌ శ్రీరాముడిగా ప్రభాస్‌ ఇలా ఉండనున్నాడంటూ న్యూ లుక్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. అయితే ఇది అసలైన లుక్‌ కాదని, కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఆసక్తి ఆపుకోలేక పలు శ్రీరాముడి పాత్రలకు ప్రభాస్‌ ఫొటోను జీఐఎఫ్‌లో ఎడిట్‌ చేసి షేర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌, ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్‌ డేట్స్‌ కూడా వచ్చేశాయి 

ఏదేమైనా తమ అభిమాన హీరోను ఇలా శ్రీరాముడి లుక్‌లో చూసుకుని ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. కాగా ఆదిపురుష్​ మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000  థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్​ రిలీజ్​ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రభాస్‌ నటిస్తున్న  మరో పాన్‌ ఇండియా చిత్రాలురాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. అలాగే సలార్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement