‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో పలకరించిన హీరోయిన్ మీనాక్షీ చౌదరి. హిట్- 2తో హిట్ కొట్టిన ఆమె.. తెలుగు సినీ రంగంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకున్నట్టే... ఫ్యాషన్ వరల్డ్‌లోనూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమెకు నచ్చిన బ్రాండ్స్‌లో ఇవి కొన్ని..
లేబుల్ సోనమ్ లుథ్రియా..
ముంబై ఎస్‌ఎన్‌డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సోనమ్ లుథ్రియా.. 2012లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఫ్యాబ్రిక్‌పై సోనమ్‌కున్న పట్టు.. ఆమెను టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో ఒకరిగా చేర్చింది.
ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
కర్ణిక జ్యూయెల్స్..
ఫ్యాషన్‌కు తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ కర్ణిక జ్యూయెల్స్‌ను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలిబ్రిటీ బ్రాండ్స్‌గా నిలిపింది.
అన్ని రకాల గోల్డ్, సిల్వర్, గోల్డ్ ప్లేటేడ్ నగలతో పాటు, ఫ్యూజన్, నక్షీ, నవరతన్, స్వరోవ్‌స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది.
బ్రాండ్ వాల్యూ
చీర బ్రాండ్: లేబుల్ సోనమ్ లూథ్రియా.
ధర: రూ. 25,500
జ్యూయెలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్
ధర: రూ. 33,000
నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. అలాగే ముందు మనకు మనం అందంగా ఉన్నామని నమ్మాలి. అప్పుడే మన అందం మరింత అందంగా కనపడుతుంది.
– మీనాక్షీ చౌదరి
-దీపికా కొండి
Comments
Please login to add a commentAdd a comment