
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మక తన ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 'ఇది మందన్నా ఫ్యామిలీ అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వును తీసుకొస్తారు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం' అంటూ తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రష్మిక పోస్ట్ షేర్ చేసింది.
ఈ ఫోటోలో రష్మిక పేరెంట్స్‌తో పాటు ఆమె చెల్లి కూడా ఉంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రష్మికకు ఇంత చిన్ని చెల్లెలు ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment