ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పెళ్లి వేడుక అంటే కచ్చితంగా ఆహ్వాన పత్రికలు అచ్చేయిస్తున్నారు చాలా మంది. తమ బంధు మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారి ఇంటికి వెళ్లి లేదా పోస్టు ద్వారా పెళ్లి పత్రికను అందజేస్తారు. కుటుంబ సమేతంగా తప్పకుండా వివాహానికి రావాలని సంతోషంగా చెబుతుంటారు.
అయితే ఈ పెళ్లి పత్రికే ఇప్పుడు ఓ కుటుంబం పరువు పోయేలా చేసింది. ప్రింటింగ్ కంపెనీ చేసిన చిన్నపొరపాటు వీరిని బంధమిత్రుల ఆగ్రహానికి గురి చేసింది. ఆహ్వాన పత్రికలో ఒక్క పదం మిస్ కావడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది.
'నేను ప్రేమతో ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తున్నాను. మీరు మా పెళ్లికి రావడం మర్చిపోండి' అని వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ అయింది. 'పెళ్లికి రావడం మర్చిపోకండి' అనే పదానికి బదులు ఒక్క అక్షరం మిస్ అయి మర్చిపోండి అని అచ్చయింది. దీంతో పెళ్లి కార్డు రిసీవ్ చేసుకుని చదివిన బంధువులు అవాక్కయై నోరెళ్లబెట్టారు. పెళ్లికి రావొద్దని పెళ్లి పత్రికలోనే చెప్పడం ఏంటి? బిత్తర పోయారు.
ఈ పెళ్లి కార్డును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. 'ఇదిగో నాకొక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. కానీ ఇది చూశాక పెళ్లికి వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కావడం లేదు' అని అతడు రాసుకొచ్చాడు.
ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆహ్వానితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికి రావొద్దని మొహం మీదే చెప్పడం ఏంటి అని మండిపడ్డారు. ఇది నిజంగా అతిథులను అవమానించడమే, మీరు పెళ్లికి వెళ్లడం వారికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ప్రేమ మాత్రం వాళ్లింటి దగ్గర, విందు మాత్రం వేరే చోటనా? అసలు ఎవరు ఈ పత్రిక ఇచ్చింది. అని మరో నెటిజన్ స్పందించాడు.
ఇది నిజంగా అమమానించడమే పెళ్లికి తప్పకుండా పిలవాల్సిందిపోయి, మోహం మీదే రావొద్దని చెబుతారా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ పెళ్లికి రావడం మర్చిపో అని చెప్పడం మొట్టమొదటి సారి చూస్తున్నా..అని అన్నారు
చదవండి: ఎండదెబ్బకు గబ్బిలాలు విలవిల.. వాటర్ స్ప్రే కొడుతున్న గ్రామస్థులు..
Comments
Please login to add a commentAdd a comment