ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది? | Aamir khan Walk With Stick Help in Wedding Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది?

Published Sun, Feb 12 2023 12:00 PM | Last Updated on Sun, Feb 12 2023 12:33 PM

Aamir khan Walk With Stick Help in Wedding Pics Goes Viral - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కొంతకాలంగా బయటకు రావడం లేదు. ఇటీవల ఆయన నటించిన లాల్‌ సింగ్‌ చద్ధా మూవీ అనంతరం ఆయన మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. అలాగే షూటింగ్స్‌లో సైతం పాల్గొనడం లేదనే సమాచారం. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ జైపూర్‌ జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆమిర్‌ ఖాన్‌ సందడి చేశారు.

చదవండి: మహేశ్‌ మేకప్‌ మ్యాన్‌ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత!

రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్‌, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియా బాగా వైరల్‌ అవుతున్నాయి. స్టార్స్‌ అంత ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్‌కు కనుల విందుగా ఉంది. ఈ వివాహ వేడుకులో అక్షయ్‌, మోహన్‌ లాల్‌లు డాన్స్‌ చేస్తుండగా పక్కనే ఆమిర్‌ నిలబడి కనిపించాడు.

చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ

అయితే అక్కడ ఆయన చేతితో స్టిక్‌ పట్టుకుని ఉన్నాడు. ఆయన చేతితో స్టిక్‌ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంత ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు స్టిక్‌ పట్టుకుని నడుస్తున్నారు? ఆయన కాలికి ఏమైంది? అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్ల నుంచి ప్రశ్న వర్షం కురుస్తోంది. అయితే ఆమిర్‌కు ఏమైందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీనిపై ఆమిర్‌ స్పందించాలని, తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇవ్వాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement